సర్వేల పేరుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను తొలగిస్తున్నారు అంటూ మండిపడుతున్న మల్ల విజయప్రసాద్.

ysrcp leader vijayaprasad malla

పలు ప్రాంతాల్లో పల్స్ సర్వే పేరుతో సోషల్ మీడియా బృందం హల్ చేస్తూ స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నారు. ఈ కోవలొ పశ్చిమ నియోజకవర్గం స్థానిక జీవీఎంసీ 41 వార్డ్ భవాని గార్డెన్స్, సిద్ధార్థ నగర్ పలు ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు హల్చల్ చేస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. కంచరపాలెం పోలీసులకు అప్పగించారు.

సోషల్ మీడియా పేరుతో కొంతమంది వ్యక్తులను స్థానికులు అడ్డుకొని పోలీసులకు పట్టించారు. నెల్లూరు, నల్గొండ, వరంగల్ వంటి పట్టణాల నుండి 60 మంది బృందం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో సర్వే నిర్వహిస్తున్నట్లు ఆ వ్యక్తులు తెలుపుతున్నారు.

సోషల్ పోస్ట్ ప్రొఫెషనల్ సర్వీస్ పేరుతో గుర్తింపు కార్డులు ఉన్నాయి. అదే గుర్తింపు కార్డులు కొంత గడువు వరకే ఉన్నాయి. కాలం చెల్లిన గుర్తింపు కార్డులతో గ్రామలో సర్వే నిర్వహిస్తుండడంతో యువకులు అడ్డుకున్నారు.

ప్రజా వాయిస్ అను సంస్థ పేరుతో సర్వే అన్న ఒక ప్రో ఫారం లో మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు ,మాజీ ,ఎంపీపీలు ,న్యాయవాదులు, కుల సంఘాల నాయకులు, స్వచ్ఛంద సేవా ప్రతినిధులు ,గ్రామాల్లో నివాసముండే ప్రభుత్వ ఉపాధ్యాయులు టిడిపి ,వైయస్సార్ సిపి నాయకులు ,జనసేన నాయకుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.

ఈ మేరకు వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షులు మల్ల విజయ్ ప్రసాద్ హుటాహుటిన స్థానిక కంచరపాలం పోలీస్ స్టేషన్ కి చేరుకొని సమాచారం అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మల్ల విజయప్రసాద్ మాట్లాడుతూ దొంగ సర్వేల పేరుతో టిడిపి నాయకులు అక్రమంగా పలు ప్రాంతాల నుంచి వచ్చి ఓట్లను తొలగిస్తున్నారని అన్నారు.

ఇది చాలా బాధకరమని ఆవేదన వ్యక్తపరిచారు ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు ఓట్లను తొలగించ ఓట్లను తొలగించే లక్ష్యంగా జిల్లాలో బోగస్ సర్వేలు జరుగుతున్నాయి.

ఈ వ్యవహారం వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఓట్ల తొలగింపు కోసం సాంకేతిక పరిజ్ఞానం కలిగి ననిపుణులను అనంతపురం చిత్తూరు జిల్లా నుంచి రప్పిస్తున్నారు. వారికిచ్చిన టా్బు లొ పలు ప్రశ్నలు ఉంటాయని నిందితులు వెల్లడించారు.

ఓటర్లను ప్రశ్నించి సమాధానాలు రాబట్టాలి అవసరం ఉంటుందని చెప్పారు. టీవీ చూస్తారా? గ్రామంలో ఉన్న సమస్యలను రాష్ట్ర స్థాయి సమస్యలను పరిష్కరిస్తారని? సీఎం పనితీరుపై మీ అభిప్రాయం ఏమిటని? గత ప్రాంతంతో పోలిస్తే ఈ ప్రభుత్వ అవినీతి పై మీ అభిప్రాయం? వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా, రానున్న ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటు వేస్తారు? ఇలాంటి 18 ప్రశ్నలు వరకు ఉన్నట్లు సభ్యులు చెప్పారు.

సర్కార్ కి వ్యతిరేకంగా సమాధానం చెప్పేవారు ఓట్లను తొలగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *