తొలి జాబితాలో 126 మలి జాబితాలో 15…TDP party…

తొలి జాబితాలో 126 మంది అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ మలి జాబితాలో మరో 15 మందిని ప్రకటించింది. ఈ జాబితాలో ఉప్పులేటి కల్పన పయ్యావుల కేశవ్ తదితరులకు చోటు లభించింది. కాగా మరో 34 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సివుంది.

126 మందిని తొలి జాబితాలో ప్రకటించిన టిడిపి శనివారం అర్ధరాత్రి దాటాక 15 మంది అభ్యర్థులను రెండో జాబితాలో ప్రకటించింది. తొలి జాబితాలో శ్రీకాకుళం జిల్లాలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధికార పార్టీ మిగిలిన ఒక్క స్థానమైన పాలకొండ కూడా అభ్యర్థిని ప్రకటించింది. దివంగత మాజీ ఎమ్మెల్యే నిమ్మక గోపాల రావు తనయుడు నిమ్మక జయకృష్ణ కు పార్టీ టికెట్ ఖరారు చేసింది. గోదావరి జిల్లా పిఠాపురం నుంచి ఎస్ వి ఎస్ ఎన్ వర్మ కు టికెట్ దక్కింది. రంపచోడవరం నుంచి వంతల రాజేశ్వరి కి, పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు నుంచి గన్ని వీరాంజనేయులు, కృష్ణాజిల్లా పెడన నుంచి కాగిత వెంకటకృష్ణ ప్రసాద్ పోటీ చేయనున్నారు. ఉప్పులేటి కల్పన బరిలో దిగనున్నారు

126 మందిని తొలి జాబితాలో

  • సూళ్లూరు పేట – పర్సా వెంకటరత్నం
  • నందికొట్కూరు – బండి జయరాజు
  • బనగానపల్లె – బీసీ జనార్ధన్ రెడ్డి
  • రాయదుర్గం – కాల్వ శ్రీనివాసులు
  • ఉరవకొండ – పయ్యావుల కేశవ్
  • తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి
  • మడకశిర – కే ఈరన్న
  • మదనపల్లి – దమ్మలపాటి రమేశ్
  • చిత్తూరు – ఏసీ మనోహర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *