ప్రకాశం లో కన్నకూతురిని కడతేర్చిన తండ్రి ప్రేమ వ్యవహారమే కారణం అంటూ హత్య

ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం కొత్త పాలెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘటన సోమవారం వెలుగు చూసింది.

పోలీసుల కథనం ప్రకారం వేరే కులం వ్యక్తిని ప్రేమించి పరువు తీసింది అన్నకారణంతో, కన్న తండ్రి కుమార్తె ను కిరాతకంగా హతమార్చాడు.

గుండెపోటుతో మృతి చెందిందని నమ్మించేందుకు ప్రయత్నించాడు. పోలీసుల జోక్యంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

తాళ్ళూరు మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన కోట వెంకరెడ్డి రెండో కుమార్తె వైష్ణవి (20) ఒంగోల్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది.

అదే కళాశాలలో చదువుతున్న వేరే సామాజిక వర్గానికి చెందిన సహ విద్యార్థి. అతను ఆమె కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

ఈ వ్యవహారం గతంలోనే తండ్రి వరకు వెళ్లగా ఆయన కుమార్తె ను మందలించాడు.

అప్పట్నుంచి ఇదే విషయమై ఇద్దరి మధ్య తరచు వాగ్వివాదాలు జరుగుతూ వస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి తండ్రి కూతురి మధ్య మరోసారి గొడవ జరిగింది.

తీవ్ర ఆగ్రహానికి గురైన వెంక రెడ్డి. కుమార్తె పై దాడి చేయడంతో పాటు గొంతు నులిమి హత్య చేశాడు.

తర్వాత మృతదేహాన్ని అద్దె ఇంట్లో నుంచి అదే గ్రామంలోని సొంత ఇంటికి తరలించాడు.

గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

మృతదేహంపై గాయాలు, గొంతు నులిమిన ఆనవాళ్లు ఆధారంగా వైష్ణవి హత్యకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని దర్శి సీఐశ్రీనివాసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *