ఇంజనీరింగ్ కళాశాలలో బాలికల వసతి గృహం లో కలకలం

గుర్తుతెలియని ముగ్గురు యువకులు ఇంజనీరింగ్ విద్యార్థుల వసతి గృహం లోకి ప్రవేశించి, కత్తులతో బెదిరించి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా రాజనగరం మండలం ఐ ఎస్ టి ఎస్ ఆర్ కళాశాల వసతి గృహం లో ఆదివారం రాత్రి జరిగింది.

సుమారు 300మంది విద్యార్థునులు ఉన్న వసతి గృహంలోని ఓ గదిలోకి ప్రవేశించిన యువకులు తమ ప్రవర్తనతో విద్యార్థులను భయబ్రాంతులకు గురి చేయడంతో వారు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు.

ఈ సందర్భంగా విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందిని పిలిచినా వారు స్పందించకపోవడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

చివరకు విద్యార్థులంతా మేలుకొవడంతో ఆ యువకులు అక్కడి నుంచి పారిపోయారు.

ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం కనీసం స్పందించకపోవడంతో సోమవారం విద్యార్థునులు ఆందోళన బాట పట్టారు.

ఆకళాశాల ప్రాంగణంలో నిరసన చేపట్టారు.

దీంతో స్థానిక పోలీసులు రంగప్రవేశం చేసి ఆ ప్రాంతాన్ని పరిశీలించి విద్యార్థులను విచారించారు.

448, 5 0 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగన్మోహన్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *