ఢిల్లీలో’ఆంధ్ర’పరువు తీసేశారు…

విభజన తర్వాత నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేయాలంటూ ఎవరు అడిగినా ఈ విషయంలో తప్పు పట్టాల్సిన అవసరం లేదు.

ప్రత్యేక హోదా దండగ అని గతంలో చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు మాట మార్చి… రాజకీయ లబ్ది కోసమే ప్రత్యేక హోదా కోరుకుంటున్నాను అని చెప్పారు.

అయిన రాజకీయమే చేస్తున్నాడని మనం సరిపెట్టుకోవాలి. అటు వైఎస్ జగన్ కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకెవరైనా అయ్యుండొచ్చు… ఆఖరికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా అవచ్చు… ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాలని ఎవరు డిమాండ్ చేసిన వారిని మనం అభినందించాల్సిన విషయమే కదా…

కానీ, ఢిల్లీలో చంద్రబాబు చేసిన పని ఏమిటి.. ధర్మ పోరాట దీక్ష అంటూ ఎంత హంగామా చేశారు. వేదిక మీదకు జాతీయ స్థాయి నేతలు వచ్చారు. చంద్రబాబుకి ఢిల్లీలో ఉన్న పలుకుబడి అలాంటిది మరి.

కానీ, శివాజీని వేదిక మీదకు తీసుకువచ్చి., బీజేపీని పెట్టించడమే హాస్యాస్పదం అయిపోయింది.. శివాజీ మాత్రమే కాదు, సినీ నటి దివ్య వాని వ్యవహారమే మరింత దారుణంగా ఉంది. ఆమె మైక్ అందుకొని తిట్ల పంచాంగం మొదలుపెట్టారు…

వెండితెరపై దివ్యవాణి లో ఈ తరహా యాంగిల్ ని ఎవరు ఎప్పుడూ చూడలేదు…

బుల్లి తెరపై కొన్ని క్యారెక్టర్లు చేసే పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు…

ఈ మధ్య ఎక్కువగా బుల్లితెర పైనే కనిపిస్తోన్న దివ్యవాణి…

రాజకీయ వేదిక పై నోటికొచ్చినట్లు మాట్లాడుతూ రాజకీయాల్లోనూ అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు ఏమో మరి… హద్దులు మీరి మాట్లాడేస్తోంది.

శివాజీ అయితే, బిజెపి ఎంపి జీవీఎల్ నరసింహారావుకి సవాల్ విసిరారు.. ఆయన ఆరోగ్యం మీద సెటైర్లు వేశారు. బెజవాడ వచ్చి తిరిగి వెళ్ళగలమా అని ప్రశ్నించారు…

ఢిల్లీ అంటే దేశ రాజధాని అని.. అక్కడికి చంద్రబాబును అండ్ కో వెళ్ళింది నిరసన తెలపడానికి, ఆ నిరసన తెలిపే క్రమంలో కొంత ఆవేశకావేశాలకు సహజమే కావచ్చు… కానీ, మరి ఇంతలా గానా… ఇదేదో స్క్రిప్ట్ డ్ వ్యవహారంలో ఉంది కానీ, ఇంకోటి కానేకాదు… మంచి వాగ్ధాటి కలిగిన నేతలు ఎంచుకుని లెక్కలతో సహా మాట్లాడించి ఉంటే అది ఇంగ్లీష్, హిందీలలో ప్రసంగాలు ఉండేలా ప్లాన్ చేసి ఉంటే దేశమంతా, ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయం గురించి ఇంకా బాగా తెలుసుకునే అవకాశం ఉండేది కదా. అది మానేసి తిట్ల దండకం ఏంటి.. ఒక్క మాటలో చెప్పాలంటే,చంద్రబాబు ఢిల్లీ దీక్ష తో ఆంధ్ర ప్రదేశ్ పరువు తీసిన చేశారు అని చెప్పుకోవచ్చు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *