ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని…ఆ దేశ ఎంపీలు పార్లమెంటులో డిమాండ్ చేశారు

ఇమ్రాన్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంట ఇరుదేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొనేందుకు పాటుపడుతున్న ఇమ్రాన్‌ ఖాన్‌ నోబెల్ శాంతి బహుమతికి పూర్తిగా అర్హుడంటూ పాక్ ఎంపీలు పార్లమెంటులో నినాదాలు చేశారు.

1.పాకిస్థాన్ కొత్త పల్లవి అందుకుంది
2.భారత్ పైలట్‌ను తిరిగి అప్పగించిన ఆయన నోబెల్ శాంతి బహుమతికి అర్హుడంటూ ఆ దేశ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు.

ఓ వైపు భారత్‌పైకి ఉగ్రవాదులను ఎగదోస్తూ, మరోవైపు శాంతి మంత్రం పఠిస్తున్న పాకిస్థాన్ సరికొత్త పల్లవి అందుకుంది. తమ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆ ఎంపీలు పార్లమెంటులో డిమాండ్ చేశారు.

సరిహద్దుల్లో భారత్‌తో యుద్ధ వాతావరణం కొనసాగుతున్నప్పటికీ బందీగా చిక్కిన ఆ దేశ పైలట్‌ను తిరిగి క్షేమంగా అప్పగించడం సామాన్య విషయం కాదని ఎంపీలు పేర్కొన్నారు.

ఇరుదేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొనేందుకు పాటుపడుతున్న ఆయన నోబెల్ శాంతి బహుమతికి పూర్తిగా అర్హుడంటూ పార్లమెంటులో నినాదాలు చేశారు.

పుల్వామా ఉగ్రదాడి తర్వాత పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ దాడిలో సుమారు 300 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఈ దాడిని పాకిస్థాన్ ఖండించింది.

తమ భూభాగంలోకి భారత్ యుద్ధ విమానాలు రావడం తమ సార్వభౌమాధికార్ని దెబ్బతీయడమేనంటూ శోకాలు పెట్టింది.

దానికి ప్రతీకారంగా భారత భూభాగంలోకి పాక్ ఎఫ్-16 యుద్ధ విమానాలు చొచ్చుకువచ్చాయి. వాటిని వెంబడిస్తూ వెళ్లిన ఐఏఎఫ్ మిగ్ విమానం ఒకదాన్ని కూల్చివేసింది.

అదే క్రమంలో ఆ విమానం పాక్ భూభాగంలోకి వెళ్లడంతో పాకిస్థాన్ దాన్ని కూల్చివేసింది. ఆ విమానాన్ని నడుపుతున్న పైలట్ అభినందన్ వర్ధమాన్ పాక్ సైన్యానికి చిక్కాడు.

జెనీవా ఒప్పందం ప్రకారం అతడికి భారత్‌కు అప్పగించాలంటూ అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవడంతో మూడోరోజే అతడిని పాక్ అప్పగించింది. దీనిపై స్వదేశంలో ఇమ్రాన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నా.. అంతర్జాతీయంగా మాత్రం అనేక దేశాలు ఆయన్ని అభినందించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *