కార్యక్రమం ఏదైనా.. జనం మధ్య ఏ ఆర్బాటం లేకుండా నేను మీతోటి వ్యక్తినే అంటూ జగన్

అప్రతిహతంగా సాగిన ప్రజాసంకల్ప యాత్ర కావొచ్చు..ప్రస్తుతం దిగ్విజయంగా కొనసాగుతున్న సమర శంఖారావం సభలు కావొచ్చు.. పేరుమారినా, కార్యక్రమం ఏదైనా జగన్ వ్యవహారశైలి మాత్రం మచ్చుకైనా మారలేదు.

ప్రజల మధ్య ఉండడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు జగన్

నిన్నటికి నిన్న కడపలో జరిగిన సమర శంఖారావం సభలో ప్రజల్లో కలిసిపోయారు జగన్.

నేతలంతా ప్రసంగాలిచ్చి పారిపోతున్న ఈ సమయంలో.. జగన్ ప్రజల మధ్యలోకి వెళ్లారు. వాళ్లు అడిగిన ముఖ్యమైన సమస్యలకు సమాధానాలు ఇచ్చి మరీ అక్కడ్నుంచి కదిలారు.

ఇంకా చెప్పాలంటే తన ప్రసంగం కంటే, ప్రజల సమస్యలు వినడానికే ఎక్కువ సమయం కేటాయించారు జగన్.

ఉద్యోగాల భర్తీ, ఆరోగ్యశ్రీ, కడప ఉక్కుఫ్యాక్టరీ, పింఛన్లు.. ఇలా ఒకటేంటి, రాష్ట్రంలో ఎక్కువమంది ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై విస్పష్టంగా స్పందించారు జగన్.

ప్రజల్లోకి వెళ్లి మరీ వాటికి సమాధానాలు ఇచ్చారు.

అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఉద్యోగాల భర్తీ ప్రారంభిస్తామన్న జగన్, ఆస్పత్రి ఖర్చు వెయ్యిదాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు చేపడతామని ప్రకటించారు.

ఇక బాబు ప్రకటించిన పింఛన్లపై తనదైన శైలిలో స్పందించారు. తను పథకాలు ప్రకటించిన తర్వాతే చంద్రబాబు తాయిలాలు ఇస్తున్నారని విమర్శించారు.

ఇన్నాళ్లూ ప్రజల్ని పట్టించుకోని చంద్రబాబు, ఇప్పుడు ప్రలోభాలతో వాళ్లను మభ్యపెడుతున్నారన్న జగన్, ఎన్నికల వేళ రోజుకో స్కీమ్ తో చంద్రబాబు మోసం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఐదేళ్లు సమయం ఇచ్చినా పట్టించుకోని చంద్రబాబు, ఆఖరి నిమిషంలో ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి సినిమా చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు జగన్.

తను చంద్రబాబులా చేయనని, అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి, మూడేళ్లలో ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

ఇలా సమర శంఖారావం సభలో ప్రజల మద్య తిరుగుతూ, వాళ్లు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలిచ్చారు జగన్.
నవరత్నాలతో పాటు మరెన్నో పథకాల్ని ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రజల మధ్యలోనే ప్రకటించిన జగన్.. ఇప్పుడు సమస్యల పరిష్కారాల్ని, హామీల్ని కూడా ప్రజల మధ్యలో ఉంటూనే ప్రకటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *