భారత్ దాడి చేస్తే ధీటైన సమాధానం చెప్తాం: ఇమ్రాన్ ఖాన్

పుల్వామా ఉగ్రదాడి విషయంలో భారత్ తమపై అసత్య ప్రచారం చేస్తోందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. పాక్ ప్రభుత్వం గానీ, ఆర్మీ గానీ ఉగ్రవాదులకు మద్దతిచ్చే ప్రసక్తే లేదన్నారు.

పుల్వామా ఉగ్రదాడి అంశంలో భారత్ తమపై అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

ఉగ్రవాదులకు మద్దతివ్వాల్సిన అవసరం పాక్‌కు లేదన్నారు. భారత్ దాడికి పాల్పడితే తామూ ధీటైన సమాధానం చెబుతామని హెచ్చరించారు.

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన ఉగ్రదాడిపై పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఎట్టకేలకు స్పందించారు.

ఉగ్రదాడితో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతివ్వదని, తాము కూడా ఉగ్రవాద బాధితులేమంటూ మొసలి కన్నీరు కార్చారు.

పుల్వామా ఉగ్రదాడి విషయంలో భారత్ తమపై అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఇమ్రాన్ ఖాన్. పాక్ ప్రభుత్వం గానీ, ఆర్మీ గానీ ఉగ్రవాదులకు మద్దతిచ్చే ప్రసక్తే లేదన్నారు. పాకిస్థాన్ కూడా ఉగ్రదాడులతో సతమతమవుతోందన్న సంగతి ప్రపంచం గుర్తించాలన్నారు.

భారత్ తమపై ఆరోపణలు చేయడం మాని ఉగ్రదాడిపై ఆధారాలు చూపితే ఏమైనా చర్యలు తీసుకోగలమని స్పష్టం చేశారు. అలా కాదని తమపై దాడికి దిగితే ధీటైన సమాధానం చెప్పేందుకు పాక్ ఆర్మీ కూడా సిద్ధంగా ఉందని హెచ్చరికలు జారీచేశారు.

ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడితో దేశమంతా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 40మంది జవాన్లు అమరులయ్యారు.

ఈ ఘటనకు పాల్పడింది తామేనని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దాడితో దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగిలాయి.

దీనికి దాయాది దేశం పాకిస్థానే కారణమంటూ ప్రజలంతా ఆందోళనలు చేపట్టారు.

ఈ దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని అనుమానిస్తున్న భారత ప్రభుత్వం..

ఆ దేశానికి ఇస్తున్న ‘అత్యంత అనుకూల దేశం’ హోదాను వెనక్కి తీసుకుంది.

ప్రపంచం ముందుకు పాక్‌ను ఏకాకిని చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed