నాకు ఓటు హక్కు లేదు.. ఈ దేశంతో సంబంధమే లేదు: ‘యాత్ర’ దర్శకుడు

నేను ఇక్కడకి కథ చెప్పడానికి వచ్చా. కథ చెప్పా. సినిమా చేశా అంతవరకే నా పని. అయితే రాజకీయాలు ఇక్కడే కాదు ఎక్కడైనా ఉంటాయి. రాజకీయాల్లోకి రావాలి.. ప్రజలకు సేవ చేయాలి లాంటి ఆలోచనలు ఏం లేవు.

పొలిటికల్ జానర్‌లో సినిమా తీసినంతమాత్రాన పాలిటిక్స్‌ని అంటకట్టడం కరెక్ట్ కాదన్నారు ‘యాత్ర’ మూవీ దర్శకుడు మహి వి రాఘవ. అసలు తనకు రాజకీయాలంటే ఇంట్రస్ట్ లేదని..

జగన్ తనకు ఎమ్మెల్యే సీటు ఇస్తారంటూ వచ్చిన వార్తలు ఖండిస్తూ తనకు అసలు భారతదేశ పౌరసత్వమే లేదంటూ ఆసక్తికరకామెంట్స్ చేశారు మహి వి రాఘవ.

‘యాత్ర’ను ఆపలేరు…యాత్ర మూవీ ప్రేక్షకులకు చేరువైంది. కలెక్షన్స్ అనేవి తరువాత విషయం. సీడెడ్, గుంటూరు, నెల్లూరు జిల్లాలలో కలెక్షన్స్ ఫుల్‌గా ఉన్నాయి.

కొన్ని ఏరియాలలో డల్‌గా ఉన్నాయి. అయితే ఇది పొలిటికల్ మూవీ కాబట్టి పార్టీ, కులం, ప్రాంతం ఇలా కొన్ని అంశాలు ప్రభావితం చేస్తాయి.

ఇందులో ఎవరి తప్పూ లేదు.

ఏ ఊరిలో అయినా రెండు వర్గాలు ఉంటాయి. ఓ వర్గం ప్రేక్షకులకు నచ్చడం మరో వర్గం ప్రేక్షకులకు నచ్చకపోవడం లాంటివి తరచూ జరుగుతుంటాయి.

సినిమాని సినిమాలా చూసే పరిస్థితి ఇప్పుడైతే లేదు. సినిమా బాగుందా లేదా అన్నది తరువాత విషయం ముందు ఈ కారణాలన్నీ సినిమాని ప్రభావితం చేస్తాయి.

వీటిని మార్చలేం. అయితే సినిమా అన్నది ఒక్క థియేటర్‌లోనే కాదు.. కొన్ని రోజుల తరువాత టీవీల్లో వస్తుంది అప్పుడు ప్రేక్షకులు చూడకుండా ఆపగలరా?

అక్కడ కూర్చున్నప్పుడైనా ఎవడూ చూడకుండా కన్నీళ్లు తుడుచుకోవల్సిందే కదా.

నాకు ఓటు హక్కే లేదు.. జగన్ సీటు ఎలా ఇస్తారు?

నాకు ఓటు హక్కు లేదు.. ఈ దేశంతో సంబంధమే లేదు. నాకు న్యూజిలాండ్ పౌరసత్వం ఉంది. నాకు రాజకీయాలు అవసరం లేదు.

జగన్ సీటు ఇస్తారన్నారని ఏవేవో ప్రచారం చేస్తున్నారు అదంతా అవాస్తవం. నేను ఇక్కడకి కథ చెప్పడానికి వచ్చా. కథ చెప్పా. సినిమా చేశా అంతవరకే నా పని.

అయితే రాజకీయాలు ఇక్కడే కాదు ఎక్కడైనా ఉంటాయి. రాజకీయాల్లోకి రావాలి.. ప్రజలకు సేవ చేయాలి లాంటి ఆలోచనలు ఏం లేవు.

నా పని సినిమాలు తీయడం అంతే. ప్రస్తుతానికి సినిమాలు కూడా ఏమీ చేయట్లేదు.

కాస్త టైం తీసుకుని నెక్స్ట్ సినిమా తీస్తా. నాకు సినిమా తీయాలంటే.. సుమారు రెండేళ్లు పడుతుంది. హడావిడిగా సినిమాలు తీయలేను. పరుగెత్తే వాళ్లను చూసి వెనకే వెళ్లాలని నాకు లేదు. మనకు కుంటికాలు ఉంటే పరిగెత్తలేం కదా.

ఇండస్ట్రీ నుండి చాలా మంది ఫోన్‌లు చేశారు.. క్రిష్ ఫోన్ చేయాలనుకోవడం తప్పు..
ఈ సినిమా విడుదలైన తరువాత ఇండస్ట్రీకి చెందిన వాళ్లు చాలా మంది ఫోన్‌లు చేశారు.

వాళ్ల పేర్లు చెబితే మిగతావాళ్లు ఎందుకు చెప్పలేదనే పేరు వస్తుంది. వాళ్లు నాకు ఫోన్లు చేశారు వాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వాలి. మనకు నచ్చింది కదా అని వాళ్లు పొగడలేదు వీళ్లు పొగడలేదని అనుకోవడం తప్పు.

ఎన్టీఆర్ బయోపిక్ తీసిన దర్శకుడు క్రిష్ తనకు ఫోన్ చేయలేదని నేను బాధపడటం లేదు.. ఎందుకంటే ఆయన సినిమాకి నేను చేయలేదు.

అలాంటప్పుడు ఆయన చేయాలని ఎందుకు అనుకోవాలి’ అంటూ ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టినట్టు తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు యాత్ర దర్శకుడు మహి వి రాఘవ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *