కరోనా బాధితుడికి వైద్యం నిరాకరిస్తే ఆస్పత్రి రద్దు.. సీఎం జగన్ సంచలన ప్రకటన..

కరోనా బాధితులకు ఏ ఆస్పత్రి కూడా వైద్యం నిరాకరించరాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనా అలా చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

కోవిడ్‌ 19 నివారణ చర్యలపై సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కోవిడ్‌ 19 బాధితులకు ఏ ఆస్పత్రులైనా వైద్యం అందించకపోతే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.

ఇటువంటి ఆస్పత్రుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే కోవిడ్‌ ఆస్పత్రుల్లో వైద్య సేవలపై పూర్తి దృష్టి పెట్టండని సీఎం జగన్ ఆదేశించారు.

రానున్న కాలంలో అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సదుపాయాలు కల్పించాలన్నారు.

అలాగే కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవడానికి శాశ్వత కేంద్రాలు ఉండాలని అవి ఎక్కడ ఉన్నాయనే దానిపై ప్రజలకు తెలియజేయాలని అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు.

‘‘ఎవరికైనా కోవిడ్‌ సోకిందన్న అనుమానం ఉంటే వారు ఎక్కడకు వెళ్లాలి? ఎవరికి కాల్‌ చేయాలి? వారు ఏం చేయాలన్న దానిపై చైతన్యం కలిగించాలి. దీనికి సంబంధించిన హోర్డింగ్స్‌ను విస్తృతంగా పెట్టాలి.

అలాగే కరోనా టెస్టులు ఎస్‌ఓపీ ప్రకారం చేయాలి. ఎవరికి చేయాలి అన్న దానిపై స్పష్టమైన ప్రోటోకాల్‌ ఉండాలి. టెస్టులు చేయాల్సిన వారి కేటగిరీలను స్పష్టంగా పేర్కొనాలి’’ అని సీఎం జగన్ సూచించారు.

Must Read: కరోనాతో మరణిస్తే అంత్యక్రియలకు రూ. 15 వేలు.. సీఎం జగన్ సంచలన నిర్ణయం

కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేయడానికి ప్రత్యేక బస్సులను వినియోగించి పరీక్షలు చేస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

అలాగే హైరిస్క్‌ ఉన్న క్లస్టర్లలో కూడా ఆ బస్సుల ద్వారా పరీక్షలు చేసి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేస్తున్నామని చెప్పారు.

టెస్టుల్లో నెగిటివ్‌ వచ్చినా.. ఎక్స్‌రేలో విభిన్నంగా కనిపిస్తే పాజిటివ్‌గా పరిగణిస్తూ వైద్యం అందిస్తున్నామని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు.

పాజిటివ్‌గా తేలిన వారు ఆలస్యంగా ఆస్పత్రికి వస్తుండటంతో మరణాలు సంభవిస్తున్నాయని, అందుకే వాటిని తగ్గించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వివరించారు.


కరోనా వైరస్ నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.

కరోనా రోగులకు ఏ ఆస్పత్రిలోనైనా వైద్యం చేయాల్సిందేని స్పష్టం చేశారు.

కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆమేరకు సన్నద్ధం కావాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

దీనికి సంబంధించి అనుసరిస్తున్న ప్రణాళికను సీఎం అడిగి తెలుసుకున్నారు.

విపత్తు సమయంలో వారు సేవలందిస్తున్నందున వారికి మెరుగైన జీతాలు ఇవ్వాలని సీఎం తెలిపారు. అవసరాలకు అనుగుణంగా వైద్యుల నియామకానికి సన్నాహాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *