వెయ్యికాళ్ళ మండపం పునర్నిర్మాణంపై వాయిదా వేసిన హైకోర్టు

తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న వెయ్యికాళ్ల మండపాన్ని పునర్నిర్మాణం చేసెల దేవాదాయ శాఖ కార్యదర్శి తితిదే ఈవో ను ఆదేశించాలని అభ్యర్థిస్తూ ఎమ్మెల్యే ఆర్కే రోజా దాఖలు చేసిన ప్రజా హిత వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి.

ఇరువైపు వాదనలను విన్న ధర్మాసనం నిర్ణయాన్ని వాయిదా వేసింది.

హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ జస్టిస్ ఎన్ సత్యనారాయణ మూర్తి తో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

తొలుత ఎమ్మెల్యే రోజా తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తొలగించిన ప్రదేశంలోనే నిర్మిస్తామని ,తితిదే గతంలో హైకోర్టుకు హామీ ఇచ్చింది అన్నారు.

ఆలయ భద్రతకు ముప్పు ఉoదన కారణాన్ని తెరపైకి తెచ్చి నారాయణగిరి ప్రాంతంలో మండపం ఏర్పాటుకు తీర్మానం చేసిందన్నారు.

తితిదే తరపు న్యాయవాది లలిత వాదనలు వినిపిస్తూ 1983లో వెయ్యికాళ్ల మండపం కూల్చివేతకు తితిదే తీర్మానం చేసింది.

ఆ తరువాత పురోగతి లేదు 2002లో మరోమారు తీర్మానం చేసి మండపానికి చేశారు.

అనంతరం త్రిసభ్య కమిటీ మండపoను అలిపిరి లో నిర్మించాలని సిఫార్సు చేసింది, తర్వాత నారాయణ గిరి లో మండపం నిర్మించడం ఉత్తమమని తితిదే 2015లో తీర్మానం చేసింది.

దీనిని సవాలు చేస్తూ 2016లో కిషోర్ స్వామి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలిచ్చింది.

ఇప్పటికీ ఆ ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి అని తెలిపారు ఇరువైపు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం నిర్ణయాన్ని వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *