హిమాచల్‌లో భారీ వర్షాలు..

హిమాచల్‌లో భారీ వర్షాలు.. లోయలోకి కొట్టుకుపోయిన ట్రక్
భారీ వర్షాలు హిమాచల్ ప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. జనజీవనం స్తంభించింది. వరద ప్రవాహంలో చిక్కుకొని, బురదతో పాటు ఓ ట్రక్కు లోయలోకి కొట్టుకుపోయింది.

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.
వరద ప్రవాహంలో చిక్కుకొని లోయలోకి కొట్టుకుపోయిన ట్రక్కు.
కొండ చరియలు విరిగి పడుతుండటంతో మరింత ఆందోళన.

హిమాచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అకాల వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. కొండ చరియలు విరిగిపడుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

భారీ వర్షాలతో పలు ప్రాంతాలకు రవాణా స్తంభించింది. రాష్ట్రంలోని కులూ ప్రాంతంలో ఓ భయానక ఘటన చోటుచేసుకుంది. వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఓ ట్రక్కు.. భారీ లోయలోకి జారీ పోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలను వీడియోలో గమనించవచ్చు.

అదృష్టవశాత్తూ ప్రమాద సమయంలో ట్రక్కులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. భారీ వర్షం, వరదలతో పాటు వచ్చిన బురద ప్రవాహంలో చిక్కుకొని ట్రక్కు.. చూస్తుండగానే లోయలోకి కొట్టుకుపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *