Pawan Kalyan గతంలో వర్మని కాలితో తన్నారా? ‘పవర్ స్టార్’లో ఆ సీన్ వెనుక ఆంతర్యం?

పవర్ స్టార్ సినిమాలో వోడ్కా బాటిల్‌తో ఎంట్రీ ఇచ్చిన వర్మ.. పవర్ స్టార్‌ని ఉద్దేశించి.. ‘ఓకేసార్..
మీరు నన్ను కావాలని తన్నలేదని తెలుసు.. సారీ చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే మీరు పవర్ స్టార్.. మీరు కూడా వేరే వాళ్లకి సారీ చెప్తే.. ఆ పదానికి అర్థం లేదు’’ అంటూ డైలాగ్ వేశారు.
అనేక వివాదాల నడుమ రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ మూవీ ఆన్ లైన్‌లో విడుదలైంది.
ఇక ఈ సినిమాకు పోటీగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది కూడి వర్మకి కౌంటర్ ఇస్తూ ‘పరాన్నజీవి’ అనే చిత్రాన్ని విడుదల చేశారు.
అయితే పరాన్నజీవి చిత్రంలో వర్మను పనికిమాలిని జీవిగా చూపించారు దర్శకుడు నూతన్ నాయుడు.
అయితే పవర్ స్టార్ సినిమాలో డైరెక్ట్‌గా వర్మే కెమెరా ముందుకు వచ్చి..
అసలు ఎందుకు తాను పవన్ కళ్యాణ్‌పై ట్వీట్లు చేయాల్సి వచ్చిందో క్లారిటీ ఇస్తూ..
పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ప్రసన్నం చేసుకునేలా ‘జై పవర్ స్టార్’ అంటూ నినాదం చేశారు.
అయితే ట్రైలర్‌లో చూపించిన విధంగానే పవన్‌ను కించపరిచే సన్నివేశాలు కూడా ఈ సినిమాలో చాలానే ఉన్నాయి.
అయితే వర్మ రూపొందించిన ‘పవర్ స్టార్’ సినిమాలో పవర్ స్టార్-వర్మల మధ్య వచ్చే కీలక సన్నివేశంపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
ఇందులో పవన్ కళ్యాణ్ గురించి అద్భుతంగా చెప్పారు రామ్ గోపాల్ వర్మ.
ఆయన వెనుకనే ఉండి వెన్ను పోటు పొడిచిన మిత్రుల గురించి ప్రస్తావిస్తూ.. ఆయన పార్టీ ఫెయిల్ కావడానికి కారణాలను విశ్లేషించారు.
అదే సందర్భంలో ప్రధాన విలన్‌గా పవన్ కళ్యాణ్ మిత్రుడు, జనసేన పొలిట్ బ్యూరో సభ్యుడు రాజు రవితేజను గాజు తేజగా విశ్లేషించారు వర్మ.
అతని తెలివిని ఓ స్కూల్ పిల్లాడితో పోల్చారు వర్మ.
మనసేన (జనసేన) పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి మొదటి కారణం ఆ గాజు తేజ అని.. మీ ఒరిజినాలిటీని చంపేశాడంటూ సంచలన కామెంట్స్ చేశాడు వర్మ.
(రివ్యూ: ‘పవర్ స్టార్’ రివ్యూ: ప్రెస్ మీట్‌లో చెప్పాల్సింది.. సినిమా తీసి రూ.300 లాగాడు!)
పవన్ కళ్యాణ్.. భజన బ్యాచ్ నుంచి ఆయన్ని ‘కాపు’ కాయడానికే వర్మ ప్రయత్నించినట్టుగా తెలియజేస్తూ..
ఆయనపై ఆపారమైన ప్రేమ ఉందిని తెలియజేశాడు వర్మ.
అదే సందర్భంలో.. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సూపర్ డూపర్‌గా గెలిచి ఆయన సీఎం కాబోతున్నారని గ్లాస్ పగలగొట్టి మరీ ఆ సీన్‌లో చెప్పారు వర్మ.
పవన్ కళ్యాణ్ సీఎంగా గెలిచిన రోజున పవన్ మొత్తం అభిమానులందిరికన్నా ముందు జై పవర్ స్టార్ అని అరుస్తా అంటూ పవన్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపే ప్రసంగాన్ని ‘పవర్ స్టార్’ సినిమాలో చేశారు రామ్ గోపాల్ వర్మ.
అయితే వర్మ మాటలో మధ్యలో పవన్ కళ్యాణ్ లేచి వెళ్తూ పొరపాటున వర్మకు కాలు తగిలిస్తారు..
అయితే ఈ సీన్‌ని హైలైట్ చేసిన వర్మ.. ‘‘ఓకేసార్.. మీరు నన్ను కావాలని తన్నలేదని తెలుసు.. సారీ చెప్పాల్సిన అవసరం లేదు..
ఎందుకంటే మీరు పవర్ స్టార్.. మీరు కూడా వేరే వాళ్లకి సారీ చెప్తే.. ఆ పదానికి అర్థం లేదు’’ అంటూ డైలాగ్ విసురుతారు.
అయితే చివర్లో పవన్ వచ్చి వర్మను కౌగిలించుకునే సీన్ ఉందనుకోండి.. అది వేరే విషయం కాగా.. వర్మను నిజంగానే పవన్ కళ్యాణ్ తన్నాడా??
ఈ సీన్ ‘పవర్ స్టార్’లో పెట్టాల్సిన అవసరం ఏముంది?? పవన్ కళ్యాణ్‌ని సారీ చెప్పమని వర్మ అడిగాడా??
ఆయన సారీ చెప్పకపోవడం వల్లే ఆయన ప్రతీసారి పవన్‌ని టార్గెట్ చేస్తున్నారా??
అసలు వర్మ.. పవన్ కళ్యాణ్‌ని కలవడం కల్పితమా?? లేక కథకోసం వర్మ అల్లిన కట్టుకథా అన్నది ఆసక్తిగా మారింది.