టీడీపీ మేనిఫెస్టోలో రైతులకు వరాలు అన్నదాత సుఖీభవ

Kamma brothers suspects other caste voters

Kamma brothers suspects other caste voters

ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తోన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ జిల్లాల నేతలతోనూ సమావేశం అవుతున్నారు. ఇప్పటికే కొన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

టీడీపీ మేనిఫెస్టో రెండో సమావేశంలో కీలక అంశాలపై చర్చ. రైతులకు ప్రోత్సహకాలు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు. యువత వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టేలా ప్రోత్సహించేలా చర్యలు.

రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి అధికారం చేపట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కృత‌నిశ్చయంతో ఉన్నారు. ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతోన్న చంద్రబాబు, జిల్లాల వారిగా సమీక్షలు నిర్వహిస్తూ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నారు.

మరోవైపు, మేనిఫెస్టో కమిటీని ఏర్పాటుచేసి, రెండుసార్లు సమావేశం నిర్వహించారు. ఆర్థిక మంత్రి యనమల అధ్యక్షతన సోమవారం మేనిఫెస్టో కమిటీ రెండో సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ప్రధానంగా వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాల గురించే చర్చించారు.

రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఉచిత పంటల బీమా పథకం, పాడి పరిశ్రమను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు రైతులకు రాయితీపై పశు దాణా సరఫరా చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించనున్నారు.

అలాగే రైతులకు ఆర్థిక సాయం అందించడానికి ప్రవేశపెట్టిన అన్నదాత-సుఖీభవ పథకాన్ని మేనిఫెస్టోలో పొందుపర్చాలని, ఇది నిరంతరం కొనసాగుతుందన్న స్పష్టతను ఇవ్వాలని నిర్ణయించారు.

ఆహా ! ఎన్నికల ప్రభావం మోసపూరిత వాగ్దానాలు ! సబ్సిడీలు వద్దన్న చంద్రబాబు గారు ఉచితాలకు మల్లటం ప్రపంచ మరో వింత.

అలాగే స్వామినాథన్‌ కమిటీ చేసిన పలు సిఫారసుల్ని ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోందని, మిగతా వాటిని అమలు చేయడానికి అవసరమైన చర్యల్ని మేనిఫెస్టోలో ప్రకటించాలన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది.

ఎంతో కష్టపడి పండించిన పంటలకు బీమా చేసుకోకపోవడం వల్ల ప్రకృతి విపత్తులు, కరవు కాటకాలు సంభవించినప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతున్నందు వల్ల ప్రభుత్వమే మొత్తం ప్రీమియం చెల్లించేలా ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలన్న అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. దీన్ని కూడా మేనిఫెస్టోలో పొందుపరచాలని నిర్ణయించారు.

అలాగే, యువత వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టేలా ప్రోత్సహించేందుకు చేపట్టాల్సిన ప్రత్యేక చర్యల గురించి కూడా చర్చించారు.

ప్రకృతి సేద్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి, యువతకు భాగస్వామ్యం కల్పించడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది.

రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభించేలా ప్రత్యేక చర్యలు ప్రకటించాలని, మార్కెటింగ్‌ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని నిర్ణయించారు.

కోల్డ్ స్టోరేజ్‌లు పెద్ద ఎత్తున ప్రోత్సహించి, ముఖ్యంగా ఆక్వా ఉత్పత్తుల్ని నిల్వ చేసేందుకు వీటి నిర్మాణానికి ప్రోత్సాహకాలు అందజేయనున్నారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకి ప్రత్యేక ప్రాధాన్యత, పాడి పరిశ్రమను అభివృద్ధికి దాణా పరిశ్రమల్ని ఏర్పాటు చేసేవారికి ప్రోత్సాహకాలు ఇస్తారు.

ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ప్రకటిస్తారు. పశుసంపదను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *