బీపీ షుగర్ బాధితులకు శుభవార్త

ఇటీవల కాలంలో బీపీ షుగర్ తో బాధపడుతున్న రోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోగులు ప్రైవేట్ మందుల దుకాణాల్లో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది.

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత మందుల పథకం అందుబాటులోకి ప్రజల్లోకి తీసుకు వచ్చింది.

ఈ పథకం ద్వారా నెలకు సరిపోయే మందులు ఒక్కసారి పొందవచ్చు. రాష్ట్రంలో ఏ ప్రైవేట్ ఫార్మసి షాపులోనైనా రోగులకు ఉచిత మందులు తీసుకునే సదుపాయం ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం విధి విధానాలను ఖరారు చేశారు.

ఇటీవల జరిగిన సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిసాయి… ఈ మధ్యకాలంలో ఐసీఎంఆర్, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ టెక్నాలజీ సంస్థలు ఏపీలో సర్వే నిర్వహించాయి.

ప్రైవేటు వైద్య రంగంలో నెలకు వేలకు మించి మందుల కొనుగోలు చేసే రోగుల కుటుంబాలకు ఆర్థిక ఇబ్బంది తలెత్తుతున్న విషయాన్ని గుర్తించారు వారికి ఉచితంగా మందులు ఇవ్వటం ద్వారా ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించినట్లు గా వివరించారు.

ఈ ప్రతిపాదనను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి పంపగా దీనిపై అధ్యయనం చేసిన ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ముందుగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే రోగులు తమ వ్యాధులను దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్ధారణ చేయించుకోవాలి.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో, ప్రాంతీయ ఆస్పత్రిలో, జిల్లా కేంద్ర ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య బోధన ఆస్పత్రిలో డాక్టర్లు ఈ జబ్బులను నిర్ధారించాల్సి ఉంటుంది.

ఈ నిర్ధారణ పరీక్షలు ఎన్టీఆర్ వైద్య సేవ పథకం నెట్ వర్క్ ఆసుపత్రులు వైద్యులు కూడా ఈ వ్యాధులను నిర్ధారించవచ్చు.

బీపీ పరీక్షలతో పాటు గ్లూకోజ్ నెట్ హిమోగ్లోబిన్ పరీక్షలు,,(షుగర్ కు) చేయించుకోవాలని తెలియజేశారు. షుగర్ బాధితులు ఫాస్టింగ్, పోస్ట్ postprandial పరీక్షలతో వ్యాధిని నిర్ధారించాలని సూచించారు.

అనంతరం డాక్టర్ రోగి పరీక్షా ఫలితాలను AP-eRX APP ద్వారా అప్లోడ్ చేస్తారు.

వెంటనే రోగి సెల్ ఫోన్ నెంబర్ కు ఎస్ఎంఎస్ కోడ్ వస్తుంది. దీంతో రోగి లబ్ధిదారులుగా ఎంపిక అయినట్లు నిర్ధారణ అవుతుంది.

ఈ కోడ్ను చూపించి రిటైల్ మెడికల్ షాప్ నాకు వెళ్లి మందులు తీసుకోవచ్చు.

ఒకేసారి నెలకు సరిపడే మందులు రోగులు తెచ్చుకోవచ్చు.

ఈ పథకంలో లబ్ధిదారులుగా చేరేందుకు రోగులు వారి యొక్క ఆధార్, ప్రజా సాధికార సర్వే వివరాలను అనుసంధానం చేస్తారు.

ప్రజా సాధికార సర్వే లో నమోదు కాని వారు వారి సమీపంలో ఉన్న మీసేవ కేంద్రంలో సంప్రదించాల్సి ఉంటుందని ప్రభుత్వం సూచించింది.

మందుల దుకాణంలో ఈ పథకం కింద రోగులకు మందులు విక్రయించాల్సిన రిటైల్ మెడికల్ దుకాణాలు వారు మొదట యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.

తర్వాత తాము విక్రయించే మందులను బిల్లు, రోగి కోడ్ నెంబర్ నో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం వారానికి ఒకసారి ద్వారా మందుల దుకాణాలకు ఆన్లైన్ పేమెంట్ చేస్తుంది.

ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీ ఎం ఎస్ డి ఈ సి) బిల్లులను చెల్లింపులను పర్యవేక్షిస్తుంది.

రిటైల్ మందులు దుకాణదారులు ఈ మందులు విక్రయించేందుకు ముందు యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.

అందుకోసం ముందుగా దానిలో. AP-eRX for pharmacy అని టైప్ చేయాలి. వెంటనే ఇన్స్టాల్ బటన్ వస్తుంది దీనిని క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయ్యే నంబర్, పాస్వర్డ్ అడుగుతుంది.

నంబర్, పాస్వర్డ్ ఇచ్చి రిజిస్టర్ అనే పథకాన్ని క్లిక్ చేస్తే పూర్తి చేయాల్సిన దరఖాస్తు వస్తుంది.

అక్కడ అడిగిన వివరాలను పూర్తి చేసిన తర్వాత వన్ టైం పాస్ వర్డ్ (OTP) వస్తుంది. ఈ నంబర్ ను వెంటనే ఎంటర్ చేసి సెండ్ కానీ ఓకే గాని చేయాలి.

వెంటనే రిటైల్ షాప్ రిజిస్టర్ అవుతుంది దీని ద్వారా రోగులకు ఈ పథకం కింద బిపి, షుగర్ మందుల విక్రయాలు జరపవచ్చని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *