గోవా సీఎం మనోహర్ పారికర్ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు…

మనోహర్ పారికర్ ఇకలేరు..
గోవా సీఎం మనోహర్ పారికర్ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు.

పాంక్రియాటిక్ క్యాన్సర్‌‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషయమించడంతో తుది శ్వాస విడిచారు.

ఈ విషయాన్ని ముందుగా రాష్ట్రపతి వెల్లడించారు.

గోవా సీఎం మనోహర్ పారికర్ (63) ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ‘ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.

ఆయన్ను దక్కించుకోవడానికి డాక్టర్లు శక్తిమేర శ్రమిస్తున్నార’ని ఆయన కార్యాలయం ట్వీట్ చేసిన కొద్ది సేపటికే ఆయన తుది శ్వాస విడిచారు.

ముందుగా ఈ విషయాన్ని రాష్ట్రపతి కోవింద్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

పారికర్ కొన్నాళ్లుగా పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. పారికర్ మరణం పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

పారికర్ మరణించడంతో గోవాలో రాజకీయ పరిస్థితిని సమీక్షించేందుకు బీజేపీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.

పారికర్ మరణించడంతో సోమవారం దేశవ్యాప్తంగా సంతాపం పాటించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.

దేశ రాజధానితోపాటు, రాష్ట్రాల రాజధానుల్లో జాతీయ పతాకాన్ని అవతనం చేస్తారు.

గత నెలలో గోవా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో చేరిన పారికర్ ఫిబ్రవరి 26న డిశ్చార్జ్ అయ్యారు.

పారికర్‌ క్యాన్సర్ బారిన పడ్డాక అమెరికాతోపాటు ఢిల్లీ ఎయిమ్స్‌, ముంబై హాస్పిటల్‌లోనూ చికిత్స పొందారు.

గత డిసెంబర్లో పారికర్ కోలుకుంటున్నట్లు కనిపించారు.

జనవరి 30న గోవా అసెంబ్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ముక్కులో ట్యూబ్‌తో ఆయన కనిపించారు.

పారికర్ నాలుగు పర్యాయాలు గోవా సీఎంగా వ్యవహరించారు.

2000 సంవత్సరంలో తొలిసారి గోవా ముఖ్యమంత్రి అయిన ఆయన.. 2005 వరకు ఆ బాధ్యతలను నిర్వర్తించారు.

2012 నుంచి 2014 మధ్య తిరిగి గోవా సీఎం అయ్యారు.

అనంతరం రక్షణ మంత్రిగా పని చేశారు.

యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు గోవా ఎన్నికల అనంతరం బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో.. ఆయన తిరిగి గోవా సీఎం అయ్యారు.

పారికర్ పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని గతేడాది అక్టోబర్ 27న గోవా ప్రభుత్వం ప్రకటించింది.

పారికర్ 1978లో ఐఐటీ బాంబే నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేశారు. భారత్‌లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తొలి ఐఐటీ పూర్వ విద్యార్థి ఆయనే కావడం విశేషం.

పారికర్ పాఠశాలకెళ్లే వయసులోనే ఆర్ఎస్ఎస్‌కు ఆకర్షితులయ్యారు. పారికర్ భార్య మేధా 2001లోనే చనిపోయారు. వారికి ఇద్దరు అబ్బాయిలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *