ఫేస్‌బుక్ అందుబాటులోకి తేనున్న తాజా ఫీచర్

ఫేస్‌బుక్‌లో ‘క్లియర్ హిస్టరీ’ ఫీచర్ త్వరలో.. ఫేస్‌బుక్ అందుబాటులోకి తేనున్న తాజా ఫీచర్‌తో.. యూజర్లు ఫేస్‌బుక్‌లో ఏమేం చేశారో హ్యాకర్లకు తెలిసే అవకాశం ఉండదు.
సో డేటా చోరీకీ గురయ్యే అవకాశం ఎట్టి పరిస్థితిల్లోనూ ఉండదు.
బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం సులభంగా క్లియర్ హ్యాకర్ల బెడదకు చెక్.
ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థ ఫేస్‌బుక్ త్వరలో తన యూజర్లకు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది.
క్లియర్ హిస్టరీ పేరిట ఆ ఫీచర్ యూజర్లకు లభ్యం కానుంది.
ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు తమ ఫేస్‌బుక్ అకౌంట్‌లో బ్రౌజింగ్ హిస్టరీ మొత్తాన్ని చాలా సులభంగా క్లియర్ చేసుకోవచచ్చు.
దీని వల్ల యూజర్లకు మరింత ప్రైవసీ లభిస్తుంది. వారి సమాచారం మరింత సురక్షితంగా ఉంటుంది.
దీంతో యూజర్లు ఫేస్‌బుక్‌లో ఏమేం చేశారో హ్యాకర్లకు తెలిసే అవకాశం ఉండదు.
ఈ అద్భుత ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తెచ్చేది మాత్రం ఫేస్ బుక్ వెల్లడించలేదు.
కానీ త్వరలోనే క్లియర్ హిస్టరీ ఫీచర్ యూజర్లకు లభించే అవకాశం ఉంది.