ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న రేవంత్ బాబు భవిష్యత్ అంతా ఫైర్ బ్రాండ్ మీదనే ఉందట

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై ఈడీ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చిన అధికారులు.. తాజాగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి.. ఆయన కుమారుల్ని సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే.

స్టీఫెన్ సన్ కు ఇచ్చిన రూ.50లక్షలు ఎక్కడివి? ఎవరు సమకూర్చారు?  మిగిలిన రూ.4.5 కోట్ల లెక్క మాటేమిటి?  లాంటి ప్రశ్నలతో వారిని ఉక్కిరిబిక్కిరి చేసినట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ నెల 19న తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని తమ ముందు హాజరు కావాలంటూ ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. దీంతో.. ఆయనేం చెబుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ కేసులో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవటం తెలిసిందే.

దీంతో.. ఆయనపై ఈడీ ప్రత్యేక ఫోకస్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.  రూ.50 లక్షలు తీసుకెళ్లి స్టీఫెన్ సన్ ఇంటికి వెళ్లిన రేవంత్..కెమేరా కంటికి చిక్కటం.. ఇదే వ్యవహారంలో జైల్లో ఉండటం తెలిసిందే.

ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో  ఈడీ రంగప్రవేశం చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఓటుకు నోటు కేసులో కీలకమైన రేవంత్ రెడ్డిని విచారిస్తే కీలక సమాచారం వెల్లడయ్యే వీలుందని భావిస్తున్నారు. ఇందుకు తగ్గ కసరత్తును అధికారులు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ నెల 19న తమ ముందుకు విచారణ కోసం హాజరుకావాలంటూ రేవంత్ కు నోటీసులు పంపిన నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లలో కొత్త గుబులు మొదలైనట్లుగా చెప్పక తప్పదు.

ఇదిలా ఉంటే.. పార్టీ మారిన తర్వాత పాత కేసులు వెంటాడుతుండటంపై రేవంత్ కొంత టెన్షన్ పడుతున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న రేవంత్.. ఈడీ అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారు? ఆయన చెప్పే జవాబులు తమ అధినేతకు ఎలాంటి ఇబ్బందులు తెచ్చి పెడతాయన్నది తెలుగుదేశం వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *