న్యూఢిల్లీలో ఆర్పిత్ ప్యాలెస్ హటల్ లో అగ్నిప్రమాదం*

మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో విశాఖ నగరం ఎండడ ప్రాంతానికి చెందిన మల్కాపురం HPCL డిప్యూటీ మేనేజర్ చలపతిరావు చిక్కుకొని దుర్మరణం పాలయ్యారు.
ఢిల్లీలో జరిగే petrotech సదస్సుకు హాజరయ్యేందుకు విశాఖ నుంచి వెళ్లిన ఆయన ఆ హోటల్లో బస చేశారు.
అయితే అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదానికి ఆయన బలి కావలసి వచ్చింది. దీం
శాఖ HPC L ల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఘోరంగా ప్రమాదం సంభవించింది.
Karol bagh ప్రాంతంలోని ఓ హోటల్ లో అగ్ని ప్రమాదం జరిగి 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో ఓ మహిళ ,చిన్నారి కూడా ఉన్నారు. అత్యంత రద్దీగా ఉండే karolbagh ప్రాంతంలో గల మూడు అంతస్తుల హోటల్స్ లో మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు, దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ప్రమాద సమయంలో చాలామంది నిద్రలో ఉండుటచే మృతుల సంఖ్య భారీగా ఉందని పోలీసులు తెలిపారు.
మంటలు వ్యాపించగానే కొందరు భవన oనుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు.
కొందరు టెర్రస్ పై నుంచి భవనం కిటికీల నుంచి కిందకు దూకేశారు. ఈ క్రమంలో ఓ మహిళ, చిన్నారి మృతి చెందారు.
మిగతావారు మంటల్లో చిక్కుకొని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయానటులు పోలీసులు తెలియజేశారు.
ఇంకా పలువురు భవనం లో చిక్కుకోగ వారి కోసం సహాయ సిబ్బంది గాలిస్తున్నారు. కాకా అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని అగ్నిమాపక సిబ్బంది తెలియజేశారు.
ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ ఈ అగ్నిప్రమాదం జరగడం చాలా బాధాకరమని, విచారం వ్యక్తం చేశారు, బాధితులను పరామర్శించి, బాధితుల కుటుంబాలకు ఐదు లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.బాదీతులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.