తిరుమలలో స్వామి వారి కైంకర్యాలు నిర్వహించే 50 మంది అర్చకులలో 15 మంది అర్చకులకు కరోనా పాజిటివ్ తేలిందన్నారు..రమణ దీక్షితులు సంచలన ట్వీట్

తిరుమలలో కరోనా కలకలం.. రమణ దీక్షితులు సంచలన ట్వీట్

స్వామి వారి కైంకర్యాలు నిర్వహించే 50 మంది అర్చకులలో 15 మంది అర్చకులకు కరోనా పాజిటివ్ తేలిందన్నారు.

కేసులు పెరుగుతున్నా ఈవో, అదనపు ఈవో దర్శనాలు అపకపోవడం అర్చకులపై వారికి ఉన్న వ్యతిరేకత గుర్తు చెస్తోందన్నారు.

తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి సంచలన ట్వీట్ చేశారు.

వంశపర్యంపర్య అర్చకులకు, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో చంద్రబాబు నాయుడు పాలసీని అమలు చేస్తున్నారన్నారు.

స్వామి వారి కైంకర్యాలు నిర్వహించే 50 మంది అర్చకులలో 15 మంది అర్చకులకు కరోనా పాజిటివ్ తేలిందని.. మరో 25 మంది అర్చకులకు కరోనా పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందన్నారు.

కేసులు పెరుగుతున్నా ఈవో, అదనపు ఈవో దర్శనాలు అపకపోవడం అర్చకులపై వారికి ఉన్న వ్యతిరేకత గుర్తు చెస్తోందని.. తన ట్వీట్‌ను ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ట్యాగ్ చేశారు.

ఇదిలా ఉంటే టీటీడీ పాలకమండలి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని అర్చక బృందం కలిసింది. అర్చకులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ ఎలా వ్యాపించిందో తెలియడం లేదన్నారు.

భక్తులు వలన అర్చకులకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు తెలిపారు.

క్యూ లైనుకు సమీపంలో అర్చకులు విధులు నిర్వహించడం లేదన్నారు. ఆరోగ్య రీత్యా అర్చకులకు బదిలి సౌకర్యం కల్పించాలని టీటీడీ అనుమతి కోరమన్నారు.

కరోనా ప్రభావం ఉన్నా శ్రీవారికీ నిర్వహించే కైంకర్యాలు ఉత్సవాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహిస్తున్నామన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.

భక్తుల సహకారంతో ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు శ్రీవారి దర్శనాని కల్పిస్తున్నామన్నారు.

రాబోయే రోజులలో కూడా ఇలాగే భక్తులకు దర్శనాన్ని కల్పిస్తామన్నారు. టీటీడీలో మొత్తం 15 మంది అర్చకులకు వైరస్ సోకింది. అర్చకులను వెంటనే శ్రీనివాసం క్వారంటైన్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *