FCI Notification 2019: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 4,103 ఉద్యోగా అవకాశాలు..

ఎఫ్‌సీఐ పరిధిలోని నార్త్‌జోన్, సౌత్‌జోన్, ఈస్ట్‌జోన్, వెస్ట్‌జోన్, నార్త్-ఈస్ట్ జోన్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఫుడ్ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియాన నోటిఫికేషన్ విడుదల చేసింది..

ఫిబ్రవరి 23 నుంచి మార్చి 25 వరకు కొనసాగనున్న దరఖాస్తు ప్రక్రియదరఖాస్తు ఫీజు రూ.500

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) భారీ మొత్తంలో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు 4103 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

దీనిద్వారా ఎఫ్‌సీఐ పరిధిలోని నార్త్‌జోన్, సౌత్‌జోన్, ఈస్ట్‌జోన్, వెస్ట్‌జోన్, నార్త్-ఈస్ట్ జోన్లలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ గ్రేడ్-II (హిందీ), స్టెనో గ్రేడ్-II, టైపిస్ట్ (హిందీ), అసిస్టెంట్ గ్రేడ్-III (ఏజీ III) (జనరల్/అకౌంట్స్/టెక్నికల్/డిపో) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 23 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది.

అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించి మార్చి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, రక్షణ దళాలకు చెందినవారు, ఎక్స్-సర్వీస్‌మ్యాన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్ రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది నియామకాలు చేపడతారు. అభ్యర్థులు ఏదైనా ఒక్క జోన్ పరిధిలో పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు..

మొత్తం పోస్టులు: 4,103
★ జోన్లవారీగా ఖాళీలు..

జోన్పోస్టుల సంఖ్య నార్త్‌జోన్1,999,సౌత్‌జోన్540,ఈస్ట్‌జోన్538,వెస్ట్‌జోన్735,నార్త్-ఈస్ట్291మొత్తం ఖాళీలు4,103
★ పోస్టుల వివరాలు..
పోస్టులు సంఖ్య జూనియర్ ఇంజినీర్ (సివిల్)114,జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్ మెకానికల్)72,స్టెనో గ్రేడ్-II76,అసిస్టెంట్ గ్రేడ్-II (హిందీ)44,టైపిస్ట్ (హిందీ)38,అసిస్టెంట్ గ్రేడ్-II (జనరల్),757అసిస్టెంట్ గ్రేడ్-II (అకౌంట్స్),509,అసిస్టెంట్ గ్రేడ్-II (టెక్నికల్)720,అసిస్టెంట్ గ్రేడ్-II (డిపో): 17731,773,మొత్తం పోస్టులు4,103
జోన్లవారీగా ఖాళీలను పరిశీలిస్తే..

★ నార్త్‌జోన్: 1,999 పోస్టులు

జూనియర్ ఇంజినీర్ (సివిల్)46,జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్ మెకానికల్)30,స్టెనో గ్రేడ్-II43,అసిస్టెంట్ గ్రేడ్-II (హిందీ),22టైపిస్ట్ (హిందీ)16అసిస్టెంట్ గ్రేడ్-II (జనరల్)256అసిస్టెంట్ గ్రేడ్-II (అకౌంట్స్)287అసిస్టెంట్ గ్రేడ్-II (టెక్నికల్)286అసిస్టెంట్ గ్రేడ్-II (డిపో)1013మొత్తం1,999

★ సౌత్ జోన్: 540 పోస్టులు

జూనియర్ ఇంజినీర్ (సివిల్)26జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్ మెకానికల్)15స్టెనో గ్రేడ్-II07అసిస్టెంట్ గ్రేడ్-II (హిందీ)15టైపిస్ట్ (హిందీ)03అసిస్టెంట్ గ్రేడ్-II (జనరల్)159అసిస్టెంట్ గ్రేడ్-II (అకౌంట్స్)48అసిస్టెంట్ గ్రేడ్-II (టెక్నికల్)54అసిస్టెంట్ గ్రేడ్-II (డిపో)213మొత్తం540

★ ఈస్ట్‌జోన్: 538 పోస్టులు

జూనియర్ ఇంజినీర్ (సివిల్)26జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్ మెకానికల్)10స్టెనో గ్రేడ్-II09అసిస్టెంట్ గ్రేడ్-II (హిందీ)03టైపిస్ట్ (హిందీ)12అసిస్టెంట్ గ్రేడ్-II (జనరల్)106అసిస్టెంట్ గ్రేడ్-II (అకౌంట్స్)87అసిస్టెంట్ గ్రేడ్-II (టెక్నికల్)224అసిస్టెంట్ గ్రేడ్-II (డిపో)61మొత్తం538

★ వెస్ట్‌జోన్: 735 పోస్టులు

జూనియర్ ఇంజినీర్ (సివిల్): 1414జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్ మెకానికల్): 0909స్టెనో గ్రేడ్-II: 0909అసిస్టెంట్ గ్రేడ్-II (హిందీ): 0404టైపిస్ట్ (హిందీ): 0404అసిస్టెంట్ గ్రేడ్-II (జనరల్): 124124అసిస్టెంట్ గ్రేడ్-II (అకౌంట్స్): 6565అసిస్టెంట్ గ్రేడ్-II (టెక్నికల్): 153153అసిస్టెంట్ గ్రేడ్-II (డిపో):353353మొత్తం735

★ నార్త్-ఈస్ట్ జోన్: 291 పోస్టులు

జూనియర్ ఇంజినీర్ (సివిల్)02జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్ మెకానికల్)08స్టెనో గ్రేడ్-II08అసిస్టెంట్ గ్రేడ్-II (హిందీ)01టైపిస్ట్ (హిందీ)04అసిస్టెంట్ గ్రేడ్-II (జనరల్)112అసిస్టెంట్ గ్రేడ్-II (అకౌంట్స్)22అసిస్టెంట్ గ్రేడ్-II (టెక్నికల్)03అసిస్టెంట్ గ్రేడ్-II (డిపో)131మొత్తం291

విద్యార్హతలు..
✦ జూనియర్ ఇంజినీర్ (సివిల్): డిగ్రీ/ డిప్లొమా (సివిల్/ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజినీరింగ్). డిప్లొమా అభ్యర్థులకు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.

✦ జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజినీరింగ్): డిగ్రీ/ డిప్లొమా (ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజినీరింగ్). డిప్లొమా అభ్యర్థులకు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.

✦ స్టెనో గ్రేడ్-II: డిగ్రీతోపాటు డీఓఈఏసీసీ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అక్రిడియేషన్ ఆఫ్ కంప్యూటర్ కోర్సెస్)లో ‘O’ లెవల్ అర్హత ఉండాలి. (లేదా) డిగ్రీ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్) ఉండాలి. వీటితోపాటు టైపింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 40 పదాలు, షార్ట్‌హ్యాండ్‌లో 80 పదాలు టైప్ చేయగలగాలి.

✦ అసిస్టెంట్ గ్రేడ్-II (హిందీ): ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హిందీ ఒక సబ్జెక్టుగా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఇంగ్లిష్ భాషపై పట్టు ఉండాలి. ఇంగ్లిష్-> హిందీ, హిందీ-> ఇంగ్లిష్ అనువాదంలో ఏడాది అనుభవం ఉండాలి.

✦ టైపిస్ట్ (హిందీ): డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. నిమిషానికి 30 హిందీ పదాలు టైప్ చేయగలగాలి.

✦ అసిస్టెంట్ గ్రేడ్-III (జనరల్): ఏదైనా డిగ్రీ. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.

✦ అసిస్టెంట్ గ్రేడ్-III (అకౌంట్స్): కామర్స్ డిగ్రీ. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.

✦ అసిస్టెంట్ గ్రేడ్-III (అకౌంట్స్): బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (బోటనీ/జువాలజీ/ బయోటెక్నాలజీ/ బయోకెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ/ ఫుడ్ సైన్స్). లేదా బీఈ/బీటెక్ (ఫుడ్ సైన్స్/ ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ/ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/ బయోటెక్నాలజీ).

వయోపరిమితి..

పోస్టులువయోపరిమితిజూనియర్ ఇంజినీర్28 సంవత్సరాలుస్టెనో25 సంవత్సరాలుఅసిస్టెంట్ గ్రేడ్-III27 సంవత్సరాలుఅసిస్టెంట్ గ్రేడ్-II28 సంవత్సరాలుటైపిస్ట్25 సంవత్సరాలు

దరఖాస్తు విధానం: ‌ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా.
పరీక్ష విధానం: రెండు దశల్లో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల పూర్తి స్వరూపం కింది విధంగా ఉంది.
ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం23.02.2019ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది25.03.2019అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్పరీక్షకు 15 రోజుల ముందుపరీక్ష తేదిపరీక్ష తేదీని వెబ్‌సైట్ ద్వారా వెల్లడిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *