బెయల్’కు ఫ్యామిలీ ప్యాక్ …వచ్చేసింది… కాంగ్రెస్ పై మోదీ విసుర్లు.

ఈమధ్య ఎటువైపు చూసినా ఆఫర్లు, ఫామిలీ ప్యాకులు ఉన్నాయి.. ఇప్పుడు బెయిల్ కి కూడా ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసింది. ఈ మహా కూటమిలో అందరూ మహా సంపన్నులే కదా మరి..

తమిళనాడులోని తిరుప్పూరులో పర్యటించిన ప్రధాని కాంగ్రెస్, మహా కూటమి టార్గెట్ గా మోడీ సెటైర్లు బెయిల్ కు ఫ్యామిలీ ప్యాక్ లు అంటూ చురకలు.బిజెపియేతర కూటమి, కాంగ్రెస్ పై మరోసారి నిప్పులు చెరిగారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ.

అవినీతికి తావు లేకుండా ప్రజలకు పాలన అందిస్తుంటే.. ఓర్చుకోలేని విపక్షాలు కూటమి కట్టాయి అంటూ మండిపడ్డారు.

అవినీతి కేసులో ఇరుక్కున్న వ్యక్తులు కూడా విమర్శలు చేస్తున్నారు అంటూ చురకలు అంటించారు.

ఆదివారం తమిళనాడులోని తిరుప్పూరులో పర్యటించిన ప్రధాని.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన మోడీ విపక్షాలపై మాటల తూటాలు పేల్చారు.

మోడీ పాలనలో విఫలమయ్యారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. నన్ను ఓడించేందుకు కూటమి కట్టాయని మోడీ అన్నారు.

శ్రీ మహా కూటమిలో ఉన్న వారంతా మహా సంపన్నులే అంటూ చురకలంటించారు మోడీ.

ఈ నేతలంతా వారి రాజవంశాలను ప్రచారం చేసుకునే తాపత్రయమే తప్ప ఉపయోగం లేదన్నారు.

తమిళనాడు ప్రజలు ఇలాంటి సంపన్నులకు ఓటమిని అంగీకరించరని అన్నారు ప్రధాని.

ఈ సందర్భంగా తమిళనాడు సీనియర్ రాజకీయ నేత, మాజీ సీఎం కె.కామరాజ్ చెప్పిన మాటల్ని గుర్తు చేశారు ప్రధాని మోదీ.

కె.కామరాజ్ అవినీతి రహిత పాలన ను అందించడమే ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు.

ఆయన చూపించిన దారిలోనే బిజెపి ప్రభుత్వం కూడా అవినీతికి తావులేకుండా పాలనను అందిస్తుందన్నారు.

ఈ మధ్య మొబైల్ రీఛార్జ్ లకు ఐస్క్రీం లకు ఫ్యామిలీ ఫ్యాక్టరీ వచ్చాయి.. ఇప్పుడు బెయిల్ కు కూడా ఫ్యామిలీ ప్యాక్ వచ్చింది అంటూ కాంగ్రెస్ నేతలకు చురకలు అంటించారు.

మోడీ కాంగ్రెస్ నేతల పేర్లు ప్రస్తావించకుండా టార్గెట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *