జగన్ కోసం ప్రచారం కి కదలివస్తున్న కుటుంబ సభ్యులు

ఎన్నికలు ఇక పట్టుమని నెలరోజులు కూడా లేకపోయే సరికి రెండు పార్టీలు హోరాహోరీగా తలపడ్డా నున్నాయి. అయితే ఇప్పటికే జగన్ బహిరంగ సభలతో ముందుకు దూసుకుపోతున్నారు.

అదే మాదిరిగా చంద్రబాబు కూడా తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. అయితే జగన్ కు సాయంగా ఆయన కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం లోకి రాబోతున్నారు.

ముందుగా వైయస్ జగన్ సోదరి షర్మిల ఈ నెల 27 నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు, గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆమె ప్రచారం ప్రారంభించనున్నారు.

ఈ నియోజకవర్గం నుంచిTDP తరపున మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. ఇచ్చాపురం వరకు 50 నియోజకవర్గాల్లో షర్మిల ప్రచారం, రోడ్ షో కొనసాగుతోంది.

ఇక జగన్ తల్లి వైయస్ విజయమ్మ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 40 నియోజకవర్గాల్లో ప్రచారం చేసే విధంగా రూట్ మ్యాప్ ను ఇప్పటికే సిద్ధం చేసింరు.

ప్రచార విషయంలో బాబుతో పోలిస్తే జగన్ మంచి స్పీడ్ గా ఉన్నారు కానీ చంద్రబాబు మాత్రం ఎక్కడికి వెళ్ళినా సోలోగా ప్రచారం చేస్తున్నారు.

ఈ విషయంలో చంద్రబాబు కు తన కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న సహకారం శూన్యమనే చెప్పాలి కొడుకు లోకేష్ ఉన్నాడు అంటే ప్రస్తుతం మంగళగిరిలో ప్రచారం లో బిజీగా ఉన్నారు.

ఒకవేళ రాష్ట్రమంతా తిప్పిన లోకేష్ వల్ల చంద్రబాబుకీ తలనొప్పి తప్పితే ఇంకా ఏమీ ఉండదు, ఇక బాలయ్య సంగతి కొత్తగా చెప్పేదేముంది తెలంగాణ ఎన్నికల్లోనే ఆయన ప్రచారం చూసాం bulbul అంటూ కామెడీ చేసి తెలుగుదేశం పరాజయానికి తన వంతు సహాయం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *