వైసీపీ అధికారంలోకి వస్తుందని తెలిసినా… మనశ్శాంతి కోసం టీడీపీ పార్టీ నేత సాధినేని యామిని చేసే ప్రయత్నం ఇది

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరంటున్నారు ఆ పార్టీ నేత సాధినేని యామిని. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని.. చంద్రబాబు మళ్లీ అధికార పీఠం ఎక్కడం ఖాయమన్నారు.

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే సమయం దగ్గరపడుతున్న కొద్దీ అందరిలో పొలిటికల్‌ ఫీవర్‌ తారస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల కోసం రాజకీయ నాయకులతో పాటు ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఎప్పుడో 40 రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. ఎవరు విజేతలో.. ఎవరు పరాజితులో అన్న ఉత్కంఠకు రేపటితో తెరపడుతుంది. అత్యంత కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు రేపు ఉదయం 8 గంటల నుంచి మొదలుకానుంది. దీని కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించనున్నారు. తొలిసారిగా ఒక్కో శాసనసభ నియోజకవర్గం పరిధిలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన అయిదు వీవీ ప్యాట్‌ చీటీలనూ లెక్కించాల్సి ఉన్నందున అధికారికంగా ఫలితాలు వెల్లడయ్యేసరికి రాత్రి 8 నుంచి 10 గంటలయ్యే అవకాశముంది. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల్లోపే పూర్తయిపోతుంది. అప్పటికి అనధికారికంగా వివరాలు తెలుస్తాయి.

✦ టీడీపీ విజయానికి వెయ్యి కారణాలున్నాయి: యామిని
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరంటున్నారు ఆ పార్టీ నేత సాధినేని యామిని. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని.. చంద్రబాబు మళ్లీ అధికార పీఠం ఎక్కడం ఖాయమన్నారు. తెలుగు దేశం పార్టీ గెలుస్తుందని చెప్పడానికి వెయ్యి కారణాలు ఉన్నాయని.. వైసీపీ గెలుస్తుందనడానికి వాళ్ల దగ్గర ఒక్క కారణం కూడా లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్ని ఆకట్టుకున్నాయని.. అదే తమ నమ్మకాన్ని పెంచిందన్నారు.

✦ ఒక్క నిమిషంలో ఫలితాలు..
ఈవీఎంలలో ఓట్లు ఎలా నమోదవుతాయి? వాటిని ఎలా లెక్కిస్తారు? ఎన్నికల ప్రక్రియలో 3 రకాల ఓట్లు ఉంటాయి. అధికారులు ముందుగా సైన్యానికి సంబంధించిన సర్వీసు ఓట్లను గణిస్తారు. ఆ తర్వాత ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి సంబంధించిన పోస్టల్ ఓట్లను లెక్కిస్తారు. సర్వీస్, పోస్టల్.. ఈ రెండు రకాల ఓట్లు తపాలా ద్వారా ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు చేరతాయి. ఉదయం 8 గంటలకు కౌటింగ్ వీటితోనే ప్రారంభమవుతుంది. వీటి లెక్కింపు పూర్తవగానే ఉదయం 8.30 గంటలకు తొలి రౌండ్‌ ఫలితం వెల్లడిస్తారు.

✦ ఓటమిని హుందాగా అంగీకరించండి
ఈవీఎంలపై విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఘాటుగా స్పందించారు. ఓటమిని హుందాగా అంగీకరించాలని.. ఈవీఎంలపై నిందలు వేయడం ఇకనైనా మానుకోవాలని సూచించారు. ఈవీఎంల‌తో ఎలాంటి స‌మ‌స్య లేద‌ని స్పష్టం చేశారు. ఇవే ఈవీఎంలతో బెంగాల్‌లో మ‌మ‌తా బెన‌ర్జీ రెండుసార్లు సీఎం అయ్యారని గుర్తుచేశారు. మాయావతి, అఖిలేశ్, అరవింద్ కేజ్రీవాల్, చంద్రబాబు నాయుడు ఈవీఎంల ద్వారానే గెలిచి సీఎంలు అయ్యార‌ని చెప్పారు. 

✦ రాజన్న పాలన అందించడమే లక్ష్యంగా..
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇచ్చిన ధీమాతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫేస్‌బుక్‌లో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. రాజన్న రాజ్యం రాబోతోందని.. సుపరిపాలన అందించడమే తన సంకల్పమన్నారు. జగన్ పోస్ట్‌తో వైసీపీ కార్యకర్తలు జోష్‌లో ఉన్నారు. రాబోయేది రాజన్న రాజ్యమేనంటూ.. జగన్ పోస్ట్‌ను షేర్ చే
ఈయనకు ఉపాథి కల్పించే స్థితిలో వారెవరూ లేరు. వాళ్లే అసలు ఉద్యోగం లేకనో, సగం పనితోనో కాలం గడుపుతున్నారు’అంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.

✦ యూట్యూబ్‌లో ఎన్నికల ఫలితాల లైవ్
సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేందుకు ప్రభుత్వ అధికారిక బ్రాడ్‌కాస్టర్ ప్రసారభారతి అన్ని ఏర్పాట్లు చేసింది. గూగుల్‌తో కలిసి లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను యూట్యూబ్‌లో నిరంతరం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రసార భారతి వెల్లడించింది. రేపు యూట్యూబ్ వెబ్‌సైట్ లేదంటే యాప్ ఓపెన్ చేసినప్పుడు టాప్ స్క్రీన్‌లో డీడీ న్యూస్‌ స్ట్రీమ్‌ కన్పిస్తుంది. ఒకసారి ఆ స్ట్రీమ్‌ను క్లిక్‌ చేస్తే డీడీన్యూస్‌ లైవ్‌ యూట్యూబ్‌ ఛానల్‌ వస్తుంది. దీంతో పాటు 14 ప్రాంతీయ భాషాల్లోని డీడీ లైవ్‌ స్ట్రీమింగ్‌ ఆప్షన్స్‌ కన్పిస్తాయి. యూజర్లు తమకు నచ్చినదాన్ని ఎంచుకుని ఎన్నికల ఫలితాలను ప్రత్యక ప్రసారంలో చూడొచ్చు.

✦ నగరిలో నా గెలుపు పక్కా: రోజా
ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాన్ గాలి బాగా వీస్తోందని, ఈసారి వైఎస్ జగన్ సీఎం కావడం పక్కా అని అన్నారు నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా. రేపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో వైసీపీ నేతలతో కలిసి బుధవారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 

✦ అర్ధరాత్రి తర్వాతే అధికారిక ఫలితం!
ఓట్ల లెక్కింపు పూర్తయి అధికారికంగా విజేతను ప్రకటించేందుకు కనీసం 14 నుంచి 16 గంటల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. మే 23న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైతే అర్ధరాత్రి తరువాత తుది ఫలితం వెల్లడించే అవకాశం ఉంది. 

✦ చంద్రబాబు, జగన్‌ నివాసాల వద్ద భద్రత పెంపు
ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలోనే చంద్రబాబు, జగన్‌ నివాసాల వద్ద భద్రత పెంపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలోనే చంద్రబాబు, జగన్ నివాసాల వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత కల్పిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో ఉన్న ఈ నేతల ఇళ్ల వద్ద ఏపీఎస్‌పీతో పాటు గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు భారీ భద్రతా చర్యలు తీసుకున్నారు.

✦ కుప్పంకు సతీసమేతంగా చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో బుధవారం పర్యటిస్తున్నారు. కుప్పంలో జరుగుతోన్న ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో బుధవారం అమ్మవారి విశ్వరూప దర్శన పూజలు నిర్వహించనున్నారు.

✦ అర్ధరాత్రి దేవెగౌడతో చంద్రబాబు భేటీ
మోదీ వ్యతిరేకులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతవారం రోజులుగా ఢిల్లీలో పలు రాజకీయ పార్టీల నేతలో సుదీర్ఘ చర్చలు సాగిస్తున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా బెంగళూరుకు చంద్రబాబు పయనమయ్యారు. మంగళవారం అర్ధరాత్రి బెంగళూరులోని పద్మనాభనగరలో మాజీ ప్రధాని దేవేగౌడతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *