తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ ఇలా

తెలుగు రాష్ట్రాల్లో పది స్థానాలకు ఎన్నికలు 21న, నోటిఫికేషన్ మార్చి12 ఎన్నికలు, అదే రోజు ఓట్ల లెక్కింపు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనమండలిలో ఐదు స్థానాలు ఉన్న ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం( ఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది.

2019 మార్చి 29 విధాన మండలి సభ్యత్వ గడువు ముగియనుంది ,వారి స్థానంలో నూతన సభ్యులను ఎన్నుకునేందుకు ఈ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ పది స్థానాలు శాసనసభ్యులు కోటలో నీవే.

షెడ్యూల్ ఇలా

నోటిఫికేషన్ విడుదల నామినేషన్ల దాఖలు ఆరంభం ఫిబ్రవరి 21, నామినేషన్ల దాఖలుకు తుదిగడువు ఫిబ్రవరి 28, నామినేషన్ల పరిశీలన మార్చి 1, ఉపసంహరణకు తుది గడువు మార్చి 5, ఎన్నికల తేదీ మార్చి 12( ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు), ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన మార్చి 12 సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తేదీ మార్చి 15.

శాసనసభలో సంఖ్యాబలం బట్టి ఈ 5 ఎమ్మెల్సీ స్థానాల్లో తెలుగు దేశం కి నాలుగు, వైకాపాకు ఒకటి , దక్కనున్నాయి.

దీంతో అధికార తెలుగుదేశంలో కోలహాలo మొదలైంది. రెండు పట్టభద్రులు నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలు, ఒక ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానం, గడువు కూడా వీటితో పాటు ముగియనుండగా వాటికి ఎన్నికల సంఘం విడిగా ప్రకటన జారీ చేయనుంది.

తెలుగుదేశం నాయకుడు ఎంవీవీఎస్ మూర్తి మరణించడంతో స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

మార్చి 29 తో కాలపరిమితి మూగిస్తోంది.

మంత్రి యనమల రామకృష్ణుడు,పి నారాయణతో పాటు, శమంతకమని, శివకుమారి , అంగూరి లక్ష్మి, ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా పదవీ విరమణ చేస్తున్నారు.

ఈ ఐదింటిలో తెలుగుదేశంకు దక్కే నాలుగు స్థానాల్లో ఎవరిని ఎంపిక చేస్తారని పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ సీనియర్ నాయకుడు యనమల

పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు మళ్లీ ఎమ్మెల్సీ చేయడం దాదాపు ఖాయం.

ఎమ్మెల్సీ కోటలో వైకాపాకు దక్కే ఏకైక ఎమ్మెస్సీ స్థానాన్ని గుంటూరు జిల్లాకు చెందిన బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి ఉన్నారు.

ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని వైకాపా అధ్యక్షుడు జగన్ ఇప్పటికే ప్రకటించారు.

తెలుగుదేశంలో ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నవారి సంఖ్య ఎక్కువే ఉంది.

ప్రస్తుతం ఎమ్మెల్యేల్లో రాజకీయ కారణాల వలన వచ్చే ఎన్నికల్లో మళ్లీ టిక్కెట్టు ఇవ్వలేని వారిని ఎమ్మెల్సీగా పంపించే అవకాశం ఉందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *