ఒక్కొక్క సినిమా బడ్జెట్ 200 కోట్లు…. అయితే చివరకు వచ్చేది ఎంత?

బాహుబలి తరువాత తెలుగు సినిమాల ఈక్వేషన్లు మారిపోయాయి. పెద్ద హీరోల సినిమాలు అన్నీ వందకోట్లను దాటేసాయి.

కొన్ని సినిమాలు అయితే రెండు వందల కోట్లను దాటేసాయి చిరు-సురేందర్ రెడ్డిల సైరా 200 కోట్లకు పైమాట సినిమానే. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూడు వందల కోట్ల సినిమా.

ప్రభాస్ సాహో సినిమా రెండు వందల యాభై కోట్ల సినిమా అని టాక్. లేటెస్ట్ గా ప్రభాస్ చేస్తున్న మరో సినిమా కూడా రెండు వందల కోట్ల సినిమా అంట.

రాధాకృష్ణ డైరక్షన్ లో ఇటలీ బ్యాక్ డ్రాప్ లో తీసే పీరియాడిక్ లవ్ స్టోరీ ఇది. దీని బడ్జెట్ కూడా రెండు వందల కోట్ల పైమాటే అంట.

ఇటలీలో పాతకాలం నాటి సెట్ లు, నిర్మాణ వ్యయం అన్నీకలిసి ఆ సినిమా బడ్జెట్ కూడా రెండు వందల కోట్లకు పైగా వుంటుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో కూడా ఒకే ఒక సింగిల్ యాక్షన్ ఎపిసోడ్ వుంటుందట. అది చాలా అంటే చాలా భారీగా వుంటుందని టాక్.

ఒక్కొక్క సినిమా బడ్జెట్ 200 కోట్లు అయితే వచ్చే దంత చివరకు వచ్చేదంతా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *