డ్రగ్స్ మాఫియా కలకలం.. హైదరాబాద్‌లో ఘనా మహిళ అరెస్ట్

హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా మళ్లీ కోరాలు విప్పుతోంది.ఓ హోటల్‌లో డ్రగ్స్ విక్రయిస్తోన్న ఘనా మహిళను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

డ్రగ్స్ కేసు: ఘనా మహిళ అరెస్ట్
సోమాజిగూడలో ఓ ఆఫ్రికన్ మహిళ దగ్గర 50 గ్రాముల కొకైన్, 10 గ్రాముల ఎక్సటేషియాను పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘనాకు చెందిన జెనీవే ఆల్డోను అదుపులోకి తీసుకున్నారు. కొకైన్‌ను గోవా నుంచి తీసుకువస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ మాఫియా సూచనతో ఇక్కడి వారికి డ్రగ్స్ సరఫరా చేయడానికి ఆమె హైదరాబాద్ కు వచ్చినట్ల సమాచారం.

సోమాజిగూడలోని హోటల్లో బుధవారంతో సాయంత్రం టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టగా.. డ్రగ్స్ విక్రయిస్తోన్న వ్యవహారం వెలుగు కీ వంచించి…జేనీవే నుంచి పాస్ పోర్ట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *