రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని డోక్రా మహిళలను నా మానస పుత్రికలు అంటు ఓట్లులు కోసం ఎర వేస్తున్న చంద్రబాబు నాయుడు

డ్వాక్రా సంఘం నా మానస పుత్రిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

శనివారం గన్నవరం మండలం కేసరపల్లిలో జరిగిన డ్వాక్రా సంఘాల ఆత్మీయ సమ్మేళనం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు ఎమ్మెల్యే వంశీ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు ఆశయసాధన్నని. 

తెలుగింటి ఆడపడుచులకు ఆర్థిక భద్రత, భరోసా కల్పించేందుకే పసుపుకుంకుమ కింద రెండవసారి 10వేల రూపాయలు ఇస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా 94 లక్షల మంది ఆడపడుచులకు. ఈ కానుకలు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆడపడుచుల కళ్ళలో ఆనందం చూస్తుంటే తనకెంతో సంతోషంగా ఉందన్నారు. పసుపుకుంకుమ సంబరాలు, పింఛనోత్సవంలో పాల్గొన్న వేలాదిమంది మహిళల ఉత్సాహం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు.

ఈ కానుకలు ఉచితంగా ఇస్తున్నానని, అప్పుగా ఇవ్వడం లేదని ఆయన చెప్పారు. చంద్రన్నపెళ్ళి కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా 26,769 మందికి 14కోట్ల రూపాయలు అందచేసినట్లు ఆయన చెప్పారు.

డప్పు కళాకారులకు , శర్మకారులకు, హిజ్రాలకు నూతనంగా పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 2014లో 200 రూపాయల పెన్షన్ వెయ్యి రూపాయలకు పెంచామని , వెయ్యి రూపాయల పెన్షను పదిరెట్లు 2వేల రూపాయలకు పెంచామని చెప్పారు.

మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు.

తాను అధికారంలో లేనప్పుడు డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డ్వాక్రా సంఘాలను బలోపేతం చేశామన్నారు. నేను ముఖ్యమంత్రిగా కాక ప్రజాసేవకుడిగా రాష్ట్భ్రావృద్ధికి నిరంతరం కృషి చేస్తునని ముఖ్యమంత్రిగా కాక ప్రజాసేవకుడిగా రాష్ట్భ్రావృద్ధికి నిరంతరం కృషి చేస్తునని చెప్పారు.

రాష్ట్రంలో 54,15లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. పింఛన్ల పెంపువల్ల 13వేల 444 కోట్లు ప్రభుత్వంపై భారం పడుతుందన్నారు.

రాజమండ్రిలో జరిగిన జయహో బీసీ సభలో 21కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినట్లు చెప్పారు. అన్న క్యాంటీన్ల ద్వారా 5రూపాయలకై శుభ్రమైన భోజనం అందిస్తున్నామన్నారు.

 ప్రభుత్వ వైద్యశాలల్లో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని, 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.

విద్యపై శ్రద్ధ పెట్టి డిజిటల్ ఉత్సవలో క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు.

ప్రజలందరూ శాశ్వతంగా ఆనందంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. కృష్ణాజిల్లాను అన్ని రంగాల్లో ప్రధమ స్ధానంలో నిలిపిన కలెక్టరు బి లక్ష్మీకాంతం, అధికార యంత్రాంగాన్ని , ప్రజాప్రతినిధులను సీఎం అభినందించారు. కృష్ణా ,గోదావరి నదులను అనుసంధానం చేసి రైతులకు సాగు, తాగునీటిని అందించినట్లు చెప్పారు.

స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీ, ఎంపీ కొనకళ్ళ నారాయణరావులు చేస్తున్న కృషిని సీఎం చంద్రబాబు వారిని ప్రత్యేకంగా అభినందించారు.

ఈనెల 9న రాష్ట్రంలో ఒకేరోజున 4లక్షల గృహాప్రవేశాలు చేపట్టి ప్రపంచ చరిత్రలో రికార్డు సృష్టిస్తున్నట్లు ఆయన చెప్పారు.

కాపులకు కాపు కార్పోరేషన్ ఏర్పాటుతో పాటు 5శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామన్నారు. కృష్ణాజిల్లా ప్రగతి శాతం 80కాగా గన్నవరం నియోజకవర్గం 82 శాతం, కేసరపల్లి 77శాతం ప్రగతి సాధించినట్లు ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. దీనిని 90 శాతానికి పెంచాలని సూచించారు.

నామీద ఉన్న నమ్మకంతో రైతులు అమరావతి రాజధాని నిర్మాణానికి 34వేల ఎకరాలు ఇచ్చారన్నారు. పార్టీ కార్యకర్తలు

నామీద ఉన్న నమ్మకంతో రైతులు అమరావతి రాజధాని నిర్మాణానికి 34వేల ఎకరాలు ఇచ్చారన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలవాలని సూచించారు.

అనంతరం డ్వాక్రా సంఘాలకు 68.82 లక్షల విలువగల పసుపుకుంకుమ బ్యాంక్ చెక్కులను పంపిణీ చేశారు.

లబ్ధిదారులకు నివేశనస్థలాలు, పెన్షన్లు అందచేశారు.

వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం పరిశీలించారు.

గన్నవరం రైతు బజారును ఆయన ప్రారంభించారు. అన్న క్యాంటీను శంఖుస్థాపన, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బందరు ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, జడ్‌పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, శాసనమండలి సభ్యులు బచ్చుల అర్జునుడు, కలెక్టరు బి లక్ష్మీకాంతం, జెసి-2 బాబురావు, నూజివీడు సబ్‌కలెక్టరు స్వప్నిల్ దినకర్, డిఆర్‌డిఎ పీడి చంద్రశేఖరరాజు, నగర మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ, అఫెక్స్‌కమిటి సభ్యులు ఆళ్ళ గోపాలకృష్ణ, విజయడైరీ డైరెక్టరు చలసాని ఆంజనేయులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రామకృష్ణప్రసాద్, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి అనగాని రవి తదితరులు ప్రసంగించారు.

వేదికను అలంకరించిన వారిలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరివెంకటబాలవర్ధనరావు, మూల్పూరి బాలకృష్ణారావు, ఎఎంసీ చైర్మన్ పొట్లూరి బసవారావు, ఎంపీపీ పట్రా కవిత, జడ్‌పీటీసీ మరీదు లక్ష్మిదుర్గ, తహశీల్దార్ కె గోపాలకృష్ణ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *