పార్టీలో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది…నియోజకవర్గాల్లో గ్రూప్ వార్ మరింత ముదురుతోంది..

నియోజకవర్గాల్లో గ్రూప్ వార్ మరింత ముదురుతోంది.. పార్టీలో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

చంద్రబాబును తిట్టరు, నాకు వార్నింగ్‌లా.. అధిష్టానానికి వైసీపీ నేత ఫిర్యాదు

ముఖ్యంగా చీరాల, దర్శి రాజకీయాలు చర్చనీయాంశంగా మారగా.. వైఎస్ వర్ధంతి రోజు భగ్గుమన్నాయి.

ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీలో రాజకీయాలు వేడెక్కాయి. నియోజకవర్గాల్లో గ్రూప్ వార్ మరింత ముదురుతోంది.. పార్టీలో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

ముఖ్యంగా చీరాల, దర్శి రాజకీయాలు చర్చనీయాంశంగా మారగా.. వైఎస్ వర్ధంతి రోజు భగ్గుమన్నాయి.

ముఖ్యంగా చీరాల అధికార పార్టీలో రెండు వర్గాల (ఆమంచి వర్సెస్ కరణం) మధ్య ఆధిపత్య పోరు మరింత ముదురుతోంది. వ్యవహారం అధిష్టానం దగ్గరకు చేరింది.

వైఎస్ వర్ధంతి రోజు రెండు గ్రూపులు పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ఆమంచి వర్గానికి ఆగ్రహం తెప్పించాయి.

చీరాల ప్రజలకు స్వేచ్ఛను ఇస్తామని ఆరోజు ప్రమాణం చేశామని.. ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చేందుకే తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు.

గతంలోలా అరాచకాలు, బెదిరింపులు సాగవని.. బెదిరింపులను ఎవరూ చూస్తూ కూర్చోరని వ్యాఖ్యానించారు. నియోజకవర్గ అభివృద్ది కోసమే అందరం కలసి వైఎస్సార్‌సీపీలోకి వచ్చామని.. అందరం కలిసి పనిచేసి చీరాలను అభివృద్ది చేసుకుందామని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై ఆమంచి వర్గం ఫైర్ అయ్యింది. జగన్ కాళ్లు పట్టుకుని పార్టీలోకి వచ్చారని కౌంటర్ ఇచ్చింది.

అంతటితో ఆగకుండా కరణం వెంకటేష్, ఎమ్మెల్సీ పోతుల సునీతలపై ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఫిర్యాదు చేశారు.

వైఎస్ వర్ధంతి కార్యక్రమంలో తనపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఇద్దరిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

టీడీపీని గాని, చంద్రబాబుని కానీ బలరాం, ఆయన కొడుకు వెంకటేష్ ఒక్క మాట కూడా అనడం లేదని.. సొంత సామాజికవర్గం మెప్పు కోసం తప్పితే..

జగన్‌పై, పార్టీపై అభిమానం లేదని విమర్శించారు. సొంత పార్టీవాడిన తనపై విమర్శలు చేయడం దారుణమన్నారు. ఈ గ్రూప్ వార్‌పై అధిష్టానం ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *