జనసేనకు డిజాస్టర్ ఎఫెక్ట్…

Jana Sena Party, Pawan Kalyan, TDP, Congress, N Chandrababu Naidu, Finance Minister Yanamala Ramakrishnudu, Amaravati, Andhra Pradesh

ఎన్నికల షెడ్యూల్, ఆపైన ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యో అవకాశాలు కనిపిస్తున్నాయి..కానీ ఇప్పటివరకు జనసేనలోకి కాస్త చరిష్మా ఉన్న నేతలు ఎవరూ చేరకపోవడం చర్చనీయాంశంగా మారింది. కనీసం ఆయారాం …గయారాం … కూడా చేరలేదు మరి.. కనీసం ఎవరు జనసేన వైపు చూడటం కూడా లేదు…

చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కాపు సామాజిక వర్గం నుంచి కొందరు కులాలకు అతీతంగా అనేక మంది వెళ్ళారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి చాలా నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, అప్పటి తాజా మాజీలు, పోటీ చేశారు.. కాంగ్రెస్, టిడిపి పార్టీలో నుంచి అప్పట్లో ఓ రేంజ్లో జంపింగ్ చేశారు. ఎన్టీఆర్ స్థాయిలో చిరంజీవి మ్యాజిక్ చేసే అవకాశాలు లేవని తెలిసిన చాలా మంది ఆ పార్టీలోకి వెళ్లారు..

ప్రజారాజ్యం తో పోల్చిన, జనసేనకు మాత్రం ఆ ఉప్పు కనిపించడం లేదు… తాజా మాజీలు ఇద్దరు చేరారు ఇప్పటివరకు… వీరిలో ఒకరు బిజెపి నుంచి వచ్చారు. ఇక మరో వ్యక్తి రేపటి ఎన్నికల్లో ప్రస్తుత స్థానంలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచే అవకాశాలు లేవు… అయినా వైకాపా లోకి వెళ్లే ప్రయత్నం చేశారు.
ఆ ఇద్దరి తర్వాత మళ్లీ జనసేనలోకి ఎవ్వరు చేరలేదు ఇప్పటివరకు… ఓవైపు జనసేన టికెట్లకు దరఖాస్తులు తీసుకుంటున్నారట… అయినా ఎమ్మెల్యేలు ,నేతలు ఎవరు వెళ్లకపోవడం విశేషం.

అన్ని కమిటీల్లోను అవే పేర్లు వినిపిస్తున్నాయి…అంతకు మించి చేరికల ముచ్చట్లు కూడా కనిపించడం లేదు.. జనసేన పార్టీని కొత్త నేతలతో నిలబెట్టుకుంటాననే అవకాశాలు కూడా లేవు… ఒకవేళ అలా జరగాలంటే చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది.

పవన్ తన సొంత పార్టీ గురించి పని చేయడం మొదలు పెట్టింది నాలుగైదు నెలలు కిందటే. ఇంత తక్కువ సమయంలో రాజకీయ పార్టీని నిర్మించడం అనేది ఆషామాషీ అయిన విషయం ఏమి కాదు.మరో పక్షం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో ఇది జనసేన పరిస్థితి .ఇక ముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *