సర్కారు వారి పాట: మహేష్ సినిమాపై పరశురామ్ స్పెషల్ కేర్.. భారీ స్కెచ్!

మహేష్ బాబు 27వ సినిమా ‘సర్కారు వారి పాట’పై డైరెక్టర్ పరశురామ్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఈ మూవీకి సంబంధించి భారీ సెట్ వేస్తున్నారని తెలిసింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు 27వ సినిమా ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాపై ఆయన అభిమానులు ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.

మరోవైపు మహేష్ బాబు వరుసగా భారీ హిట్స్ ఖాతాలో వేసుకుంటూ వస్తున్న కారణంగా డైరెక్టర్ పరశురామ్‌పై పెద్ద బాధ్యతే పడింది.

దీంతో మహేష్ గత సినిమాల కంటే భారీ హిట్ సాధించేందుకు గాను తన కసరత్తులు ప్రారంభించారు పరశురామ్.

ఈ క్రమంలోనే ఇటీవలే ‘సర్కారు వారి పాట’ టైటిల్ లుక్ రిలీజ్ చేసి అందరి చూపును ఈ సినిమాపై పడేలా చేశారు.

ఇక ఈ మూవీని బ్యాంకింగ్ నేపథ్యంలో రూపొందించనున్న కారణంగా ఎక్కడా తగ్గకుండా భారీగా బ్యాంకు సెట్ వేయిస్తున్నారట పరశురామ్.

హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో ఈ బ్యాంక్ సెట్‌ను రెడీ చేసే పనిలో చిత్ర యూనిట్ నిమగ్నమై ఉందని తెలుస్తోంది.

డిసెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలు కానుందని తెలుస్తోంది. కరోనా కారణంగా ఈ మేర లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నారట.

దీంతో కావాల్సినంత సమయం దొరికింది కాబట్టి అప్పటిదాకా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేస్తూ.. కథకు సంబంధించిన అంశాలు, భారీ సెట్స్‌పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారట దర్శకుడు పరశురామ్.

మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ సంయుక్త సమర్పణలో రూపొందనున్న ఈ మూవీలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటించనుంది.

బ్యాంకింగ్ వ్యవస్థలో అవినీతికి సంబంధించిన ఓ సామాజిక అంశాన్ని ప్రధానంగా ఈ మూవీలో ప్రస్తావించబోతున్నారని టాక్.

ఇక ఈ చిత్రానికి నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరించనుండగా, థమన్ బాణీలు కడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *