డైరెక్టర్ అనిల్ రావిపూడి కి బిఎండబ్ల్యూ కార్ ఇచ్చాడంట దిల్ రాజు

ఏదైనా సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఆ సినిమా నిర్మాతల నుండి కానీ డైరెక్టర్ నుంచి గాని కారు గిఫ్ట్ గా ఇచ్చాడు అన్న వార్తలు రావడం సర్వసాధారణమైపోయింది.
కానీ ఈ వార్తల వెనుక చాలా కథలే ఉంటాయి.
తీసిన సినిమా కి కొంత మార్జిన్ మనీ కట్టడం ద్వారా గాని , తర్వాత వచ్చే సినిమాకి అడ్వాన్స్ గా ఇలాంటివి గతంలో జరిగాయి.
కానీ కారు ఫ్రీ గా ఇచ్చిన వార్తలు మాత్రం ప్రచారం అవుతుంటాయి.
ఈ సంగతంతా పక్కనపెడితే, మొన్ననే అతి పెద్ద హిట్ ఇచ్చిన ఎఫ్ 2 మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కి, నిర్మాత దిల్ రాజు BMW కార్ గిఫ్ట్ గా ఇచ్చారు అన్న వార్తలు మాత్రం గుప్పుమంటున్నాయి.

నిజానికి ఇచ్చినా కూడా అది పెద్ద విషయం కాదు.
ఎందుకంటే దిల్ రాజు బ్యానర్లో అతి పెద్ద హిట్ ఇచ్చిన సినిమా F2. ఇంచుమించుగా ఆ సినిమాకి 30 నుంచి 35 కోట్ల లాభం వచ్చింది.
ఇంతవరకు ఇన్ని కలెక్షన్లు ఇంతలా వచ్చిన సినిమా దిల్ రాజుకు లేనేలేదు.
అందువల్ల అన్ని విధాలా మంచిదే.
కానీ అసలు విషయం ఏమిటనగా ఇప్పటివరకు అలాంటి ఏ గిఫ్ట్ అనిల్ రావిపూడి కి అందలేదని, అసలు అటువంటి విషయమే తనకు తెలియదని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.
అనిల్ రావిపూడి అయితే ఇలాంటి న్యూస్ ఒకటి వచ్చిందని తెలిసి ఆశ్చర్యానికి లోనవడమేకాక కాకుండా ఇది నిజమైతే బాగుండు అని అనుకున్నాడట.
ఇలా మరో నాలుగు హిట్లు దిల్ రాజు కి ఇస్తే నిజంగా ఆయన కార్ ఇస్తారేమో అని అనుకున్నట్లు గా ఉంది అనిల్ రావిపూడి ఆలోచన.