Data Breach By TDP

ఆంద్రప్రదేశ్రాష్ట్రప్రజలడెటా_దొంగలించబడింది.

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎంతొ గొప్యంగా ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత డేటా ని తెలుగుదేశం పార్టి తమకి అత్యంత సన్నిహితం అయిన ఐ.టి గ్రిడ్ అనే ఒక ప్రయివేట్ సంస్థకి ఇచ్చింది – ఇది ఎంత ప్రమాదమొ ప్రతి ఒక్కరు తెలుసుకొవాలి.

ఈ కాలపు దొంగకి మీ ఇంటి తాళాలు అక్కరలేదు , మీ గురించి ఒక చిన్న ఇంఫర్మేషన్ చాలు, ఆ ఇంఫర్మేషన్ మన జీవితం నే మార్చెస్తుంది, ఆ ఇంఫర్మేషన్ మన జీవితాలని నేలపాలు కూడా చెయగలవు అది ఎలాగొ తెలియాలి అంటే మనకి ముందు డార్క్ నెట్ అంటే ఎంటొ తెలియాలి

ఇంటర్నెట్3రకాలు

1) సర్ఫెస్ వెబ్
2) డీప్ వెబ్
3) డార్క్ వెబ్

1) సర్ఫెస్ వెబ్ :- మనకి ఉన్న సర్చ్ ఇంజన్స్ ( గూగుల్, యాహొ,బింగ్ ) అన్ని సర్ఫేస్ వెబ్ కిందకు వస్తాయి, అంటే పబ్లిక్ గా అందరు చూడగలిగేవి సర్ఫేస్ వెబ్ కిందకు వస్తాయి. ఇది మొత్తం ఇంటర్నెట్ లొ కెవలం 4% మాత్రమే మిగతా 96% ఇంటర్నెట్ ఈ డీప్ అండ్ డార్క్ వెబ్ లొ ఉంటాయి దిన్ని బట్టి అర్ధం చెసుకొవచ్చు రొజు మనం ఎంత ఇంటర్నెట్ ని యక్సిస్ చెయగలుగుతున్నామొ. ( తరువాత డీప్ వెన్ )

2) డీప్ వెబ్ :- డీప్ వెబ్ అంటే ఎవ్వరు గూగుల్ లాంటి సర్చ్ ఇంజన్స్ లొ సర్చ్ చెసి చూడలేని ఇంఫర్మేషన్ – ఉదాహరణకి, మన మేయిల్ బాక్స్ , గూగుల్ డ్రైవ్ లాంటివీ పూర్తిగా మన వ్యక్తిగత లాగిన్ ఐడి , పాస్ వార్డ్ ని ఉపయొగించి మాతమే చూడగలం. మన అనుమతి లేకుండా వీటిని ఉన్న ఇంఫర్మేషన్ వేరే వాళ్ళు చూడలేరు. ఈ డీప్ వెబ్ లొ పూర్తిగా మన పర్సనల్ డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి ( క్రెడిట్ కార్డ్ సమాచారం , బ్యాంక్ ఎకౌంట్ల సమాచారం, ఒటర్ ఐడి కార్డ్, రెషన్ కార్డ్, ఆదార్ కార్డ్, ప్రబుత్వ ప్రాజెక్ట్స్, ప్రభుత్వాల దగ్గర ఉండే రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం ఇలాంటి సున్నితమైన సమాచారం ఉంటుంది , దీనిని ఎవ్వరు గుగుల్ లొ కాని మరొ సర్చ్ ఇంజన్ లొ కాని చూడలేరు. ” కాని ఒక్క చొట మాత్రమే చూడగలరు అదే (టా*) పెరు బహిర్గతం చెయకూడదు .

ఇలాంటి బ్రౌజర్ లొ పలనా వ్యక్తికి సంబందించిన ఫింగర్ ప్రింట్ కాని, ఆదార్ నెంబర్ లాంటి చిన్న సమాచారం దొరికినా దానిని ఆదారంగా డీప్ వెబ్ లొ మాత్రమే యాక్సిస్ అయ్యే సమాచారం ని సులబంగా ఒపెన్ చెసి (హ్యాక్ చెసి) మీ వ్యక్తిగత సమాచారం ని దొంగలించి మీమలని ఆర్ధికంగా ఇంకా అనేక రకాలుగా నష్టపర్చవచ్చు, ప్రభుత్వ వెబ్సైట్లు హై సెక్యురిటి మేయింటేయిన్ చెయనప్పుడు ఈ డీప్ వెబ్ లొ ఉండే హ్యాకర్స్ ప్రభుత్వ వెబ్సైట్స్ ని సులబంగా హ్యాక్ చెసి అందులొ ఉండే అత్యంత విలువైన ప్రజల సమాచారం ని దొంగలిస్తారు, సాదారణంగ ప్రభుత్వాలు హై సెక్యురిటి మేయింటేయిన్ చెయటం వలన ఇటువంటి తప్పులు చాలా అరుదుగా జరుగుతు ఉంటాయి ( ఇక్కడ తెలుగుదేశ ప్రభుత్వం ఆ అవసరం లేకుండానే అత్యంత గొప్యంగా ఉండవలసిన ప్రజల సమాచారం ని ఐ.టి గ్రిడ్ అనే ప్రయివేటు సంస్థకి ఇచ్చింది )

ఎంతొ గొప్యంగా ప్రభుత్వం దగ్గర మాత్రమే ఉండవల్సిన మన వ్యక్తిగత సమాచారం ఇలా ప్రయివేటు వ్యక్తుల చెతిలొకి వెళ్ళిపొతే డీప్ వెబ్ లొ ఉండే హ్యాకర్స్ కి అత్యంత సులబంగా మన సమాచారం ని దొంగలించె అవకాశం దొరుకుతుంది.

ఉదాహరణకి మనం ఎక్కడ మనకి సంభందం లేని దగ్గర నుండి మనకి యడ్వటైజ్ మెంట్ కాల్స్ వస్తు ఉంటాయి , ఇలా రావటానికి కారణం మనం ఎక్కడొ ఒక మాల్ లొ నెంబర్ ఇచ్చి వస్తాము ఆతరువాత మనకి కాల్స్ రావటం మొదలవుతుంది , (ఇదే డెటా సెల్) రేపు నాడు మన వ్యక్తిగత ఇంఫర్మేషన్ ప్రయివేటు వ్యక్తుల చెతికి వెలటం వలన ఈ డెటా సెల్ జరగితే డీప్ వెబ్ లొ ఉండే హ్యాకర్స్ చెతిలొకి పడితే మన బ్యాక్ ఎకౌంట్స్ లొ ఉండే డబ్బు చొరీకి గురయ్యే అవకాశాలు ఎక్కువ , అనేక మది ఏకౌంట్స్ నుండి 20, లేదా 30 రుపాయల చొప్పున చొరీకి గురవుతాయి , మనం ఏ బ్యాంక్ వాడొ ట్రాంజాక్షన్ కాస్ట్ వెసాడనొ మరొకటొ అని పెద్దగా పట్టించుకొము అదే అవకాశం గా హ్యాకర్లు లక్షల మంది దగ్గర ఇలా చొరి చెసి కొట్లు కొల్లగొడతారు. ( ప్రభుత్వల దగ్గర ఉండే వ్యక్తిగత డేటా ప్రయివేటు వ్యక్తుల చెతొకి వెలితే వచ్చే ఫలితాలు ఇలా ఉంటయి. )

ఇదే డెటా డార్క్ వెబ్ వాళ్ళకి దొరికితే మన పని అయిపొయినట్టే

3) డార్క్ వెబ్:- దీనినే “డార్క్ నెట్” అని కూడా అంటారు, డీప్ వెబ్ లొ చిన్న పార్ట్ మాత్రమే డార్క్ నెట్ – ఇందులొ పూర్తిగా ఇల్లీగల్ పనులే జరుగుతాయి – అక్రమ అయుదాల, మనుషుల అవయవాల, హ్యుమన్ ట్రాఫికింగ్ లాంటివి గరుగుతాయి – అమేజాన్ లాంటి షాపింగ్ సైట్లలొ వంట సామాన్లు అమ్మినట్టు మనుషుల్ని అమ్మేస్తారు – ఇక్కడ పూర్తిగా మాఫియా రాజ్యం ఏలుతుంది. పొరపాటున ప్రభుత్వం దగ్గర ఉండవలసిన డెటా ప్రయివేటు వ్యకుల దగ్గరికి చెరి అక్కడనుండి అతి సులబంగా ఈ డార్క్ వెబ్ వాళ్ళ దగ్గరికి చెరితే, ఈ ఇంఫర్మేషన్ ఆదారంగా మన క్రెడి కార్డ్లు, డెబిట్ కార్డ్లు, పాస్పొర్టులు క్లొన్ చెసి అనేక అసాంఘిక కార్యకలాపాలకి వాడే అవకాశం ఉంది, వారి దగ్గరకి చెరిన మన సమచారం తొ మన ఆర్ధిక స్థితిగతులు అంచనవేసి కిడ్నాపులు, హత్యలు, ఆడపిల్లలని అపహరించి అక్రమ రవాణ చెసే అవకాశం కూడా ఉంది. వీరి చెతికి మన వ్యక్తిగత సమాచారం దొరికి మన జీవితం తలకిందులు అయినట్టే.

అందుకే ప్రభుత్వాల దగ్గర ఉండే ప్రజల సమాచారం అత్యంత గొప్యంగా ఉండవలసిన అవసరం ఉంది , కాని నేడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ సమాచారం ని వారి అత్యంత దగ్గర వ్యక్తులైన ఐ.డి గ్రిడ్, బ్లూ ఫ్రాగ్ అనే ప్రయివేటు కంపెనీలకు బదలాయించింది అని పొలీసులు చెబుతున్నారు. అత్యంత ప్రమాదకరం అయిన ఈ పని లొ నిజనిజాలు ప్రజలకు వివరించి దొషులని కఠినంగా శింక్షించే భాద్యత భారత ప్రభుత్వం తీసుకొవాలి. ( ఇది ప్రజల జీవితాలతొ ముడిపడిన సమస్య )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *