దండుపాళ్యం’ ప్రేరణతో 14 రేప్‌లు, 4 హత్యలు…

‘దండుపాళ్యం’ సినిమా ప్రభావంతోనే రాజు సైకోగా మారినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు చెబుతున్నారు.

ప్రేమ జంటలపై దాడులు చేస్తూ సీరియల్‌ కిల్లర్‌గా అవతరించినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది.

గుంటుపల్లి బౌద్ధారామాల సమీపంలో శ్రీధరణిని హత్య చేసిన నిందితుడు సైకో అని పోలీసుల విచారణలో వెల్లడైంది.

ప్రేమ జంటలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం, నచ్చిన అమ్మాయిలను అత్యాచారం చేసి హత్య చేయడం ఇతడికి అలవాటని పోలీసులు తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం గుంటుపల్లి(జీలకర్రగూడెం) బౌద్ధారామాల వద్ద ఈ నెల 24న జరిగిన యువతి హత్య,

యువకుడిపై దాడి కేసు నిందితుడు రాజు పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపెట్టాడు.

‘దండుపాళ్యం’ సినిమా ప్రభావంతోనే రాజు సైకోగా మారినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు చెబుతున్నారు.

ప్రేమ జంటలపై దాడులు చేస్తూ సీరియల్‌ కిల్లర్‌గా అవతరించినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది.

ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్న రాజు అత్తింటిలోనే కాపురం పెట్టాడు.

జీడితోటలకు కాపలాదారుడిగా ఉంటూ సమీపంలోని అటవీ ప్రాంతంలో జంతువులు, పక్షులను వేటాడేవాడు.

ఈ క్రమంలో అక్కడ కనిపించే ప్రేమ జంటలను బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు.

అయితే ఎవరైనా అమ్మాయిపై కన్ను పడితే మాత్రం రాజు సైకోగా మారిపోయేవాడు.

చంపేస్తానని బెదిరించి లొంగదీసుకునేవాడు. లొంగకపోతే ప్రాణాలు తీసేశాడు.

ఈ క్రమంలోనే శ్రీధరణిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశాడు.

‘దండుపాళ్యం’ సినిమా ప్రభావంతోనే రాజు సైకోగా మారినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు చెబుతున్నారు.

ప్రేమ జంటలపై దాడులు చేస్తూ సీరియల్‌ కిల్లర్‌గా అవతరించినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది.

రాజు ఇప్పటివరకు 14 మంది యువతులపై అత్యాచారాలు చేశాడని, వారిలో నలుగురిని అత్యాచారం అనంతరం దారుణంగా హత్యచేసినట్టు వెల్లడించారు.

రాజుపై ఒక్క కేసు కూడా లేదు
ప్రసిద్ధి చెందిన గుంటుపల్లి బౌద్ధారామాల సమీపంలో జరిగిన యువతి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.

దీంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ధరణి ఫోన్ కనిపించకపోవడంతో ఆ మొబైల్ నంబర్‌పై నిఘా పెట్టారు.

ధరణిని హత్య చేసిన తరువాత ఆమె ఫోన్‌ తీసుకుని వెళ్లిపోయిన రాజు జి.కొత్తపల్లిలోని అత్తవారి ఇంటికి వెళ్లాడు.

ఆ ఫోన్‌లోని సిమ్‌ కార్డును తీసి పడేసి తన సిమ్‌ కార్డును వేసి ఫోన్‌ను వాడటం మొదలు పెట్టాడు.

టెక్నాలజీ సాయంతో రాజును పట్టుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

తనకే పాపం తెలీదంటూ మొదట బుకాయించిన రాజు పోలీసులు తనదైన శైలిలో విచారించడంతో నేరం ఒప్పుకున్నాడు.

తాను సీరియల్ కిల్లర్‌గా మారిన తీరు, అత్యాచారాలు, హత్యల విషయాల చిట్టా విప్పాడు. అతడు చెప్పే విషయాలకు పోలీసులే షాకయ్యారు.

అయితే ఇన్ని దారుణాలు చేసిన రాజుపై ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంపై పోలీసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

జీలకర్రగూడెంలో శ్రీధరణి హత్య అతడికి నాలుగోది. అంతకు ముందు నూజివీడు, మైలవరం, మచిలీపట్నంలో మరో ముగ్గురు యువతులను రాజు అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

అతడి చేతిలో అఘాయిత్యాలకు బలైన వారి సమాచారం సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

ఇలాంటి నరరూప రాక్షుసుడిని కఠినంగా శిక్షించాలని ప్రజా, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *