డల్లాస్ మీటింగ్ మీద కొన్ని పాయింట్స్

ఎన్నారై వైసీపీ కన్వీనర్లు ప్రోగ్రాం ప్లాన్ చేసారు. ఇంకో పక్క డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారు నేను డబ్బులు పెట్టుకుంటాను, నేను చేస్తాను అన్నారు. కానీ ఎలక్షన్ టైం లో పార్టీ అడిగినంత డబ్బులు ఇవ్వలేదని ప్రేమ్ రెడ్డి గారిని దూరం పెట్టమని వైసీపీ కన్వీనర్లకు మెసేజ్ వచ్చింది.

దీనితో మొత్తం ప్రోగ్రాంను మేమే నడిపిస్తాం అన్నారు ఎన్నారై వైసీపీ కన్వీనర్లు. ప్రేమ్ రెడ్డి గారికి ఒక 25 వీవీఐపీ పాసులు( వైట్ కలర్ టాగ్స్) ఇస్తాము అని చెప్పారు. ఇక్కడే ఒక మెలిక ఉంది. డల్లాస్ రాజకీయ కురువృద్ధ దుర్యోధనుడు శ్రీధర్ కొర్సపాటి ఎన్నారై కన్వీనర్లలో ఒకరు.

ఇతనితో పాటు శివ అన్నపురెడ్డి అనే డల్లాస్ స్థానికుడు కలిసి, వీవీఐపీ టాగ్స్ మీద స్టార్స్ ముద్రించారు. సెక్యూరిటీ వాళ్లకు స్టార్స్ ఉన్న టాగ్స్ నే అనుమతించమని చెప్పారు. ఈ విషయం ఈ ఇద్దరికీ తప్ప ఎవరికీ తెలియదు.

తోటి ఎన్నారై కన్వీనర్లకు కూడా చెప్పలేదు. దానితో ప్రేమ్ రెడ్డి గారికి ఇచ్చిన టాగ్స్ కూడా జనరల్ టాగ్స్ అయిపోయాయి. ఈ ఇద్దరికి చంద్రగిరి చెవిరెడ్డి గారు తోడయ్యారు. ఈయన హాబీ ఏమిటంటే, హడావుడి చేసి హైలైట్ అవ్వటం. చంద్రగిరిలో చేసే స్ట్రీట్ రాజకీయం డల్లాస్ లో కూడా చేసి రచ్చ రచ్చ చేసారు.

అమెరికా ప్రోగ్రాం మొత్తం చెవిరెడ్డి గారు నడిపించారు అని రాష్ట్ర ప్రజలు, ఎమ్మెల్యేలు అనుకోవాలి, జగన్ గారి దగ్గర మార్కులు కొట్టి మినిస్టర్ కావాలి. ఈ ఆశతో సోయతప్పి వ్యవహరించారు. స్టేజి కంట్రోల్ కోసం ఈయన పడిన తపన అంతా ఇంత కాదు. హనిమిరెడ్డి గారిని లేపి కుర్చీ తీసేసిన ఘనత కూడా చెవిరెడ్డి గారిదే.

అసలు కమిటీ సభ్యులు ప్రిపేర్ చేసిన ప్రోగ్రాం ప్లాన్ ని పక్కన పెట్టి, సొంత అజెండాను ప్రదర్శించారు. అసలు చెవిరెడ్డి గారికి అమెరికాలో ఏమి పని? అయన మాట్లాడేది ఎవరికి అర్ధం అవుతుంది? స్టేజి పైన ఉన్న NRI నాయకులకు డ్రెస్ సెన్స్ అస్సలు లేదు. జగన్ గారు చెప్పేవరకు కుర్చీ కూడా వెయ్యలేదు.

స్టేజి మీద తోసుకోవటం ఏమిటి అమెరికాలో? అంత మందిని ఎవరు పంపారు స్టేజి మీదకి? సీఎం గారి ముందు డాన్సు లు ఏమిటి? పాటలకు ఏమి విజువల్స్ వేశారు? స్టేజి మీద కడప రత్నాకర్ అరుపులు ఏమిటి? కన్వీనర్ అయ్యుండి అయన డ్రెస్ కోడ్ ఏమిటి? అసలు స్టేజి మీద సర్వమత ప్రార్ధనలు ఎందుకు? ఇది అమెరికా నా లేకా చిత్తూరు జిల్లా చంద్రగిరా? జగన్ గారి ఫ్లైట్ ఆరెంజ్ చేసిన idream వాసుదేవరెడ్డి గారిది చిత్తూరు జిల్లా అని, ఆయనకు అంతటి అవకాశం ఇవ్వటానికి ఎంత తీసుకున్నారు? ఫ్లైట్ లో అందరు చిత్తూరు జిల్లావాళ్లే. వాషింగ్టన్ లో సాధారణ కార్యకర్త సురేన్ కి(చిత్తూరు) జగన్ గారితో స్పెషల్ ఫ్లైట్ లో ప్రయాణం చేసే అవకాశం ఇచ్చారు.

ఇతను చెవిరెడ్డి గారు అమెరికా వచ్చినప్పుడు అయన బాగోగులు చూసుకుంటారు. అదే అవకాశం investment చేసేవాళ్ళకి ఇస్తే బాగుండేది కదా? తెలుగు కమ్యూనిటీ నాయకులకు తీవమైన అవమానం జరిగింది. మహిళా కన్వీనర్ మాత్రం తనకి కావాల్సిన వారిని జగన్ గారి దగ్గరికి తీసుకు వెళ్లారు.

ఆమె ఎప్పుడు, ఏ కార్యక్రమం చెయ్యలేదు కాలిఫోర్నియా లో. అదే ఊర్లో వేరే వాళ్ళు చేసిన అటెండ్ కారు. కానీ ఎన్నారై కన్వినర్ పోస్ట్ మాత్రం కావాలి. కేవలం ఈమె జగన్ గారి దూరపు బంధువు కావటంతో ఆ పదవిలో ఉన్నారు. అస్సలు ఉపయోగంలేదు. ఇదే కాలిఫోర్నియా లో ఇంకో కన్వినర్ ఉన్నారు. అయన పేరు కూడా ఎవరికీ తెలియదు. కనీసం ఒక్క చిన్న ప్రోగ్రాం కూడా చెయ్యలేదు.

వీళ్లంతా ఏమి ఉద్దరించటానికి ఆ పదవుల్లో ఉన్నారో వాళ్ళకే తెలియదు. capability లేనప్పుడు ఉండకూడదు. ఇంకో ఎన్నారై కన్వీనర్ డాక్టర్ వాసుదేవరెడ్డి గారు, ఈయన ఏమి జరుగుతుందో నాకు చెప్పటంలేదు, టాగ్స్ ఎవరు ఇస్తున్నారో నాకే తెలియదు అంటారు. మేము అనుకున్న విధంగా ఇక్కడ జరగటంలేదు అంటారు.

అమెరికా, కెనడా అభిమానులకు నిరాశ మిగిలింది. జీవితంలో ఇంకో సారి ఇలాంటి ప్రోగ్రాంకి రాము అని చాలామంది అభిప్రాయపడ్డారు. ఇంతమందిని హర్ట్ అయ్యేలా చేసిన వారిని, మరియు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిన వారిని, మొత్తం ఎన్నారై వైసీపీ కన్వీనర్లను తక్షణమే తెసివేసిపారెయ్యాలని చాలామంది కోరుతున్నారు. ఇండియా నుండి ఇక్కడికి వచ్చి రచ్చ చేసిన చెవిరెడ్డి గారికి మినిస్టర్ యిస్తే ఆ డిపార్ట్మెంట్ పరిస్థితి ఎలా ఉంటుందో అమెరికాలో ఉన్న తెలుగువారికి స్పష్టమైన అవగాహన వచ్చింది. కష్టపడిన వారిని ఎవరూ గుర్తించరు, చెంచా గిరి చేసే వారికే పదవులు, హోదాలు.ఓవరాల్ గా ఈ ఫెయిల్యూర్ కి బాధ్యులు మాత్రం ” శ్రీధర్ కొర్సపాటి” “శివ అన్నపురెడ్డి” ” చంద్రగిరి చెవిరెడ్డి గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *