ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది.. ఈ మహమ్మారి ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు…కొత్తగా 182 కేసులు.. మరో ఇద్దరు మృతి

ఏపీలో కరోనా కల్లోలం: కొత్తగా 182 కేసులు.. మరో ఇద్దరు మృతి
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 11,602 శాంపిల్స్‌ను పరీక్షించగా 135మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇతర రాష్ట్రాలు (38), విదేశాల నుంచి (9) వచ్చిన వారి కేసులతో కలిపి మొత్తం 182 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది.. ఈ మహమ్మారి ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య అలాగే పెరిగిపోవడం ఆందోళన కలగిస్తోంది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 11,602 శాంపిల్స్‌ను పరీక్షించగా 135మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇతర రాష్ట్రాలు (38), విదేశాల నుంచి (9) వచ్చిన వారి కేసులతో కలిపి మొత్తం 182 కేసులు నమోదయ్యాయి. కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం తెలియజేయలేదు.

తాజా కేసులు కలిపితే రాష్ట్రానికి సంబంధించిన కేసులు 4261కు (మొత్తం5,247) చేరాయి. మరో 65మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1641కు చేరింది.

రాష్ట్రవ్యాప్తంగా కర్నూలు జిల్లాలో 800కుపైగా కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 500కు పైగా కేసులు ఉన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2540మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మొత్తం 80మంది చనిపోయారు.

గత 24 గంటల్లో కోవిడ్ వల్ల తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు.. కృష్ణాజిల్లాలో మరొకరు చనిపోయారు. తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు.

రాష్ట్రంలో కొత్త నమోదైన పాజిటివ్ కేసుల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కమ్యులేటివ్ పాజిటివ్ కేసులు 971 (వీటిలో యాక్టివ్ కేసులు 564) ఉన్నాయని ప్రకటించారు.

అలాగే విదేశాల నుంచి వచ్చిన 197మందికి వైరస్ సోకినట్లు తెలియజేశారు. కోయంబేడు లింకులతో పాటూ విదేశాల నుంచి వచ్చిన వారితో టెన్షన్ వెంటాడుతోంది.

పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అందుకే ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *