బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్.. ముంబై ఆస్పత్రిలో..


బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

అమితాబ్ బచ్చన్అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ బచ్చన్ వెల్డించారు.

శనివారం అర్ధరాత్రి అమితాబ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ముంబైలోని నానావతి ఆస్పత్రిలో అమితాబ్ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

‘‘నాకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆస్పత్రిలో చేరాను. ఆస్పత్రి వర్గాలు అధికారులకు సమాచారం అందించాయి. కుటుంబానికి, స్టాఫ్‌కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. టెస్టుల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం. గత 10 రోజులుగా నాతో దగ్గరగా మెలిగిన వారు ఎవరికి వారుగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను.’’ అని బిగ్ బి ట్వీట్ చేశారు.
కాగా, ప్రముఖ సినీ నటి రేఖకు చెందిన స్టాఫ్‌లో ఒకరి కరోనా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ఇంటిని సీల్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *