విశాఖ: మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి దారుణ హత్య

అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయడానికి వచ్చామని చెప్పి.. విజయారెడ్డిని హత్య చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో పోలీసులు.

విశాఖలో కలకలంరేపిన విజయారెడ్డి హత్య.
కాంగ్రెస్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన విజయారెడ్డి.
విజయారెడ్డి భర్త బ్యాంకు ఉద్యోగి.

విశాఖలో మాజీ కార్పొరేటర్ విజయారెడ్డిని దుండగులు దారుణంగా హత్య చేశారు. అక్కయ్యపాలెం ఎన్జీవోఎస్ కాలనీలోని నివాసంలో ఆమెను దారుణంగా హత్య చేసి.. బాత్రూమ్‌లో పడేసి వెళ్లారు.

విజయారెడ్డి ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగువారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టమ్‌కు పంపారు.

అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయడానికి వచ్చామని చెప్పి.. విజయారెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెలిసిన వ్యక్తులే ఆమెను హతమార్చి ఉంటారని భావిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

విజయారెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు.. ఆమె భర్త బ్యాంక్‌ ఉద్యోగి. హత్య జరిగిన సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారనే అంశంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *