అసెంబ్లీ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా

టీఆర్ఎస్ ఆపరేషన్‌ ఆకర్ష్‌‌పై ఫైర్ సీఎల్పీ సమావేశం అనంతరం తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు.

టీఆర్ఎస్ ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్న నేతలు సోమవారం స్పీకర్‌ను కలిసి ఎమ్మెల్యేలపై ఫిర్యాదు కలెక్టరేట్ల ముందు ధర్నాలకు కాంగ్రెస్ పిలుపు తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ రాజకీయవేడిని పెంచేస్తోంది.

ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పాటూ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర టీఆర్ఎస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు.

మరో రెండు మూడు రోజుల్లో గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు జారిపోవడంతో తెలంగాణ కాంగ్రెస్ అయోమయంలో పడిపోయింది.

నష్టనివారణా చర్యల్లో భాగంగా ఆదివారం అత్యవసరంగా సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తాజా రాజకీయాలతో పాటూ భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలు చర్చించారు.

అనంతరం ఎమ్మెల్యేలంతా ర్యాలీగా అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వరకు వెళ్లారు. నల్ల బ్యాడ్జీలతో గాంధీ విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

టీఆర్ఎస్ అప్రజాస్వామిక విధానాలను తెలంగాణ సమాజం ప్రశ్నించాలని పిలుపునిచ్చారు నేతలు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని స్పీకర్‌ను కలిసి కోరాతమన్నారు. అలాగే పినపాక, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.

కలెక్టరేట్ల ముందు ఆందోళన.. దిష్టిబొమ్మల దహనానికి కాంగ్రెస్ శ్రేణుల్ని సమాయత్తం చేశారు.

మరోవైపు సీఎల్పీ సమావేశం కూడా హాట్‌హాట్‌గానే సాగింది. గత ఎన్నికల్లో ఓటమితో పాటూ తాజా పరిణామాలపై చర్చించారు.

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్‌గా పేరున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం మధ్యలో నుంచి బయటకు వెళ్లిపోయారు.

అలాగే ఈ భేటీలో తన అభిప్రాయాలను కూడా పంచుకున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకత్వంతో మళ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ఎలా వెళ్తామని.. నాయకత్వ మార్పు అవసరమని రాజగోపాల్ అంటున్నారట.

బలమైన నాయకత్వం కావాలని.. ఎన్నికలకు ముందు అదే చెప్పానని గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *