భాగపరిష్కార రిజిస్ట్రేషన్ల పై సీఎం నిర్ణయం కుటుంబ సభ్యుల ఆస్తులు విలువ ఎంతైనా ఫీజు 20 వేలే చెల్లిస్తే సరిపోతుంది

కుటుంబ ఆస్తుల భాగ పరిష్కార రిజిస్ర్టేషన్లు చేసుకునే వారికి శుభవార్త.

ఇప్పటివరకు ఆస్తుల విలువలను బట్టి రిజిస్ట్రేషన్ ఫీజులు వేస్తూ వచ్చిన పద్ధతికి రాష్ర్ట ప్రభుత్వం ముగింపు పలికింది.

ఆస్తి విలువ ఎన్ని కోట్ల రూపాయలైనా సరే రిజిస్ట్రేషన్ ఫీజు కింద గరోష్టంగా రూ.20 వేలు చెల్లిస్తే సరిపోతుంది.

కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల పంపిణీ ఇప్పటివరకు కొంత భారం గా ఉండేది.

ఎప్పుడో తాత,ముత్తాతలు సంపాదించిన ఆస్తులను గ్రామీణ ప్రాంతాల్లో చాలా కుటుంబాలు నోటి మాట ద్వారా, లేకుంటే స్టాంపు పేపర్ మీద రాసుకుని పంచుకుని ఉంటారు.

అలాంటి వాటిని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుందా మంటే క్రమంగా పెరిగిన రిజిస్ట్రేషన్ విలువ వల్ల ఫీజు భారంగా మారింది.

అదేవిధంగా తాతల కాలం నాడు ఆ ఆస్తులు విలువ పది లక్షల ఉంటే, ఇప్పుడది 5 కోట్లకు చేరి ఉంటుంది.

భాగపరిష్కార రిజిస్ర్టేషనకు మొన్నటి వరకు రిజిస్ట్రేషన్ ఫీజు ఒక శాతంగా ఉండేది. అంతే ఈ ఐదు కోట్ల ఆస్తులను పంచుకోవడానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే 5 లక్షల చెల్లించాల్సి వచ్చేది.

గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు, వ్యవసాయ పొలాలు వీటిలో ఎక్కువుగా ఉండంతో.. అంత డబ్బు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ముందుకొచ్చేవారు కాదు.

కానీ ఇప్పుడు భాగపరిష్కార రిజిస్ట్రేషన్ ఫీజును 0. 5 శాతానికి తగ్గించారు.

దీంతో రిజిస్ట్రేషన్ ఫీజు 5 లక్షల నుంచి 2.5 లక్షలు తగ్గింది. అయినా ఇది కూడా భారమే అన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు.

భాగపరిష్కార దరఖాస్తులకు గరిష్ట ఫీజు రూ.20 వేలు మాత్రమే ఉండాలని సూచించారు.

ముఖ్యమంత్రి సూచన మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఆస్తుల విలువ తక్కువుంటే దానిపై 0.5 శాతం, ఎంత ఎక్కువున్నా రూ.20 వేలకు మించకుండా రిజిస్ట్రేషన్ ఫీజును భాగపరిష్కారాల రిజిస్ట్రేషన్కు నిర్ణయించింది.

ఎవరెవరికి వర్తిస్తుంది ఒక కుటుంబంలో ఉన్న వారు చేసుకునే భాగపరిష్కారాలకు ఇది వర్తిస్తుంది.

ఉదాహరణకు తండ్రి తన కుమారులు, కుమార్తెలకు ఆస్తులు పంచితే అది దీనికిందే వస్తుంది. భార్యాభర్తల మధ్య, తనయులమధ్య పంపకాలకు కూడా ఇది వర్తిస్తుంది.

ఒకవేళ కుమారుడు కానీ, కుమార్తె కానీ చనిపోయి ఉంటే అతని భార్య, భర్తను కూడా కుటుంబ సభ్యుడిగా నే పరిగణిస్తారు. ఈ వెసులుబాటు వల్ల భాగపరిష్కార ఒప్పందాలు పెరిగే అవకాశాలున్నాయి.

ఫీజు తగ్గించడంతో రిజిస్ట్రేషన్ల జోరు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

ఇక పట్టణాల్లో ఉన్న ఆస్తులు విలువలు బాగా పెరగడంతో అక్కడ ఆస్తులు పంపకాలు చేసుకునే వారికి ఇది మరింత ఊరట కల్పించనుందని రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *