ఊహకి అందని చంద్రోదయం

ఎప్పుడో మూడేళ్ల కిందటే షూటింగ్ ప్రారంభం అయిన చంద్రబాబు నాయుడి బయోపిక్ ‘చంద్రోదయం’ విడుదలకు సన్నద్ధం అవుతోందట!
అందుకు సంబంధించి విడుదల తేదీని కూడా ప్రకటించారు. మార్చి పదో తేదీన ఈ సినిమా విడుదల కాబోతోందట.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ లూ గట్రా విడుదల అయ్యాయి!
ఈ సినిమాను ఎందుకు తీశారో తెలియడం లేదు కానీ.. అందులో చంద్రబాబు పాత్రధారి వేషధారణ మాత్రం ప్రహసనం పాలయ్యింది.
పెరుగన్నం తిని మూతి తుడుచుకోని వ్యక్తి వలె ఉన్న ఆ గెటప్ తో సినిమా ఏమిటో ఎవరికీ అంతుబట్టకుండా ఉంది.

మరి ఈ సినిమా పట్ల చంద్రబాబు అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
ఈ సినిమా విడుదలకు భారీగా ఏర్పాట్లు చేసి.. ర్యాలీలు గట్రా నిర్వహించి.. సినిమాను సూపర్ హిట్ చేసేందుకు చంద్రబాబు అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు రెడీ అయిపోవాల్సి ఉంది.
ఈ సినిమా మేకింగ్ కు బాహుబలి మేకింగ్ కన్నా ఎక్కువ సమయమే తీసుకున్నారు. మరి ఔట్ పుట్ ఆ రేంజ్ లో ఉంటుందో!