శ్రీరెడ్డి డైలాగులు కొడుతున్న చంద్రబాబు

చంద్రబాబు నాయుడి ఎక్స్ ట్రా జబర్దస్త్ ఢిల్లీలో మరింత కామెడీని పంచింది. తొలిరోజు జబర్దస్త్ ఎపిసోడ్ కు మోడీపై కోపంతో విపక్షాలన్నీ హాజరయ్యాయి .

రెండోరోజు ఎక్స్ ట్రా జబర్దస్త్ కి మాత్రం.. పాపం మేథావులని, ఉద్యోగులని, అవకాశాల్లేని ఆర్టిస్టులని వెంటేసుకుని రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందించి వచ్చారు బాబు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ నవ్వులు పూయించారు.

ఓవైపు చంద్రబాబు జాతకం మొత్తం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న వేళ, మొన్న గుంటూరు వచ్చిన ప్రధాని మోడీ బాబును ఒక రేంజ్ లో ఆడుకున్నారు.

అంతా అయిపోయాక ఇప్పుడు చంద్రబాబు జాతకాలు విప్పుతానంటూ రెచ్చిపోతున్నారు.

తాను న్యాయంకోసం పోరాటం చేస్తుంటే బీజేపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటున్న చంద్రబాబు, వారి జాతకాలు విప్పితే మళ్లీ తలెత్తుకుని తిరగలేరంటూ హెచ్చరించారు.

అంత తిరగలేని పరిస్థితి ఉంటే విప్పితే పోతుంది కదా. ఎలాగూ బీజేపీకి వ్యతిరేకంగా కేంద్రస్థాయిలో కూటమి కడుతున్న చంద్రబాబు, వారి గుట్టుమట్లు విప్పడానికి ఎందుకు వెనకాడ్డం, అదేదో ముందేచేస్తే పోతుంది కదా!

తలెత్తుకు తిరగలేనివాళ్లు రేపు ఓట్లు ఎలా అడుగుతారు. ఒకవేళ అడిగినా జనాలు ఎలా వేస్తారు.

బీజేపీ ఓడిపోయి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా గ్యారెంటీ అంటున్న చంద్రబాబు ఆ జాతకాలేవో విప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు నెటిజన్లు.

విప్పుతా విప్పుతా అంటూ శ్రీరెడ్డి డైలాగులు చెప్పడం ఆపేసి జరిగేపని చూడవయ్యా అంటూ సలహాలిస్తున్నారు.

ఆశ్చర్యకరంగా బీజేపీ జనాలు కూడా ఇవే డైలాగులు కొడుతున్నారు.తను నోరువిప్పితే బాబు జాతకం మొత్తం బయటకొస్తుందని రాష్ట్ర, జాతీయస్థాయి కమలనాధులు కొందరు బీరాలు పలుకుతున్నారు.

రెండు పార్టీలు ఏం విప్పుతాయో తెలీదు కానీ, ఈ నాలుగున్నరేళ్లలో వీళ్లంతా కలిసి ఏపీ ప్రజల బట్టలిప్పి నడిరోడ్డుపై నిలబెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *