చంద్రబాబు ఓ మానసిక రోగి:నటుడు పోసాని కృష్ణమురళి

దేశంలో వెన్నుపోటు పేటెంట్ హక్కులు ఆయనవే -నేను అనని మాటలను ఆపాదిస్తూ కథనం వేశారు -రాధాకృష్ణా.. బుద్ధి తెచ్చుకో! -చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణపై నిప్పులు చెరిగిన నటుడు పోసాని

చంద్రబాబు ఓ మానసిక రోగి అని, దేశంలో వెన్నుపోటు పేటెంట్ హక్కులు ఆయనకే ఉన్నాయని రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి విరుచుకుపడ్డారు. ఆయ న రూపొందిస్తున్న ముఖ్యమంత్రిగారు మీరు మాటిచ్చారు.

చిత్రానికి సంబంధించి వచ్చిన ఫిర్యాదుపై వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఏపీ ఎన్నికల సంఘం నోటీసులు పంప గా.. తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటూ బదులిచ్చారు.

ఈ లేఖ ఆధారంగా ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలపై పోసాని కృష్ణమురళి గురువారం స్పందించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును కించపరుస్తూ తాను సినిమా తీయ డం లేదని స్పష్టంచేశారు.

అనారోగ్య కారణాల వల్ల ఎన్నికల సంఘం ముందు వ్యక్తిగతంగా హాజరుకాలేదని, సరిగా నడువలేని స్థితిలో ఉన్నానని చెప్పారు. యశోదా దవాఖానలో చికిత్స పొందుతున్నానని, త్వరలో ఆపరేషన్ జరిగే అవకాశం ఉన్నదని తెలిపారు.

దవాఖాన ఇచ్చిన రిపోర్ట్‌లోనూ ఈ విషయం స్పష్టంగా ఉన్నదని, ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఏపీ ఎన్నికల సంఘానికి లేఖ రాశానని వెల్లడించారు.

తన లేఖను వక్రీకరిస్తూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో బుధవారం రాత్రి కథనం ప్రసారం చేశారని మండిపడ్డారు. నేను చంద్రబాబుకు కులాన్ని ఆపాదిస్తూ విమర్శలు చేశానని, దీనిపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని, అందుకే ఏపీ ఎన్నికల సంఘం మరోసారి నాకు నోటీసులు జారీ చేసిందని ఆ కథనంలో చెప్పారు. అది చూసి నేను బెదిరిపోయి.. నేను చంద్రబాబును ఏమీ అనలేదండీ, నడవలేని స్థాయిలో ఆరోగ్యం బాగాలేక దవాఖానలో చేరబోతున్నాను అని లేఖ రాశానన్నారు.

టీడీపీకి చెందిన కుటుంబరావు చర్చలో పాల్గొని.. పోసాని నిజంగా లేవలేని స్థితిలో ఉంటే సహాయం చేస్తాం.. అబద్ధమైతే మాత్రం పెద్ద నేరం అవుతుందన్నారు. నాన్నా కుటుంబరావూ.. అబద్ధం, వెన్నుపోటు పొడిచే బుద్ధి మీ నాయకుడికే ఉంది.

దేశంలో ఆ పేటెంట్ హక్కులు ఆయనకే ఉన్నాయి అని పేర్కొన్నారు. తాను గత ప్రెస్‌మీట్‌లో చంద్రబాబును అన్న మాటలను ఏబీఎన్‌లో పెద్ద లిస్ట్ వేశారని, దానివల్లే నాకు ఈసీ నోటీసులు ఇచ్చినట్టు కథనం ప్రసారం చేశారని మండిపడ్డారు.

అవే మాటలు ఇప్పుడూ అంటున్నానని, చంద్రబాబుకు కులపిచ్చి, కులగజ్జి ఉందనడానికి తన దగ్గర సాక్ష్యం ఉన్నదన్నారు. ఎస్టీ కులంలో పుడితే వాళ్లు మనుషులు కాదా?. ఎవరైనా కర్మతో వెధవ అవుతాడు తప్ప.. కులంతో అవడు.

ఈ బుద్ధి, స్పృహ కూడా చంద్రబాబుకు లేదా?. ఇలాంటి మా టలు సీఎం అనొచ్చా.? అందుకే ఆయనకు కులం ఫీలింగ్ ఉందన్నాను అని పేర్కొన్నారు.

నాలో డాబర్‌మన్ కూడా ఉన్నారు

ఎస్టీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని వైఎస్ జగన్ అని ఉంటే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో.. ఇతనికి మదం, అహంకారం, వెంటనే ఎస్సీ, ఎస్టీ కేసు బుక్ చేయండి అని అనేవారని పోసాని పేర్కొన్నారు. రాధాకృష్ణ అన్నయ్యా.. పేపర్ పెట్టిన కొత్తలో అక్షరం ఆయుధంగా మారుస్తానన్నావు.

నువ్వు ఆయుధంగా మార్చకపోయినా ఫర్వాలేదు కానీ.. అక్షరాన్ని వేశ్యగా మార్చి మీడియా వ్యభిచారం చేయొద్దు.

అబద్ధం ఆడేవాడిని లంగా, లోఫర్, లఫూట్, బ్రోకర్, చీపర్ అంటారు. ఇవన్నీ నువ్వేగా?. చంద్రబాబుకు కులపిచ్చి ఉందని నేను అన్నమాట వాస్తవమే.

ఆయనో మానసిక రోగి. ఏ ముఖ్యమంత్రి అయినా.. ఎవరైనా ఎస్టీగా పుట్టాలని ఎందుకు కోరుకుంటారు అని అంటారా?

నారా లోకేశ్ తాగుతూ, అమ్మాయిలతో ఫొటోల్లో కనిపిస్తే ఆ వార్తని నువ్వు ఎక్కడ రాస్తావో తెలుసు.

అదే జగన్ అయితే మొదటి పేజీలో అమ్మ జగనూ దొరికావే అని రాస్తావు కదా?. ఇప్పటికీ సీరియల్‌లా వేసేవాడివి కదా?.

నువ్వెన్ని తిట్టినా చిరునవ్వుతో వెళ్లడానికి నేను జగన్మోహన్‌రెడ్డిని కాదు.. పోసాని కృష్ణమురళిని.

నాలో జెంటిల్‌మనే కాదు డాబర్‌మన్ కూడా ఉన్నాడు. బుద్ధి తెచ్చుకో.. సిగ్గు తెచ్చుకో రాధాకృష్ణ. నీ ఎంగిలి బతుకు నువ్వు బతుకు.

నాలాంటి వాడి జోలికి రావద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నా అని పోసాని కృష్ణమురళి మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *