ఈ ఎన్నికల్లో ఓటమి ఖాయమని చంద్రబాబు ఎంత భయపడుతున్నాడో

ఈ ఎన్నికల్లో ఓటమి ఖాయమని చంద్రబాబుకు అర్థమైందా.. అందుకే.. ఆయన అన్ని చివరి ప్రయత్నాలు చేస్తున్నారా.. ఎలాంటి హామీలకైనా సిద్ధమైపోతున్నారా.. ప్రసంగాల్లో ఏ స్థాయికైనా వెళ్లిపోతున్నారా.. అంటే అవుననే అనిపిస్తోంది.

కేవలం ప్రసంగాల విషయంలోనే కాదు.. ఆయన తన జీవితంలో ఎన్నడూ చేయని పనులు ఈ ఎన్నికల్లో చేస్తున్నారు.

ఇటీవల ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు ఓ ఇంట్రస్టింగ్ ఫీట్ చేస్తున్నారు.. దయచేసి ఓటు వేసి గెలిపించండి అంటూ ప్రజలకు వంగి వంగి వంగి దండాలు పెడుతున్నారు.

గతంలో చంద్రబాబు ఇలా ఎప్పుడూ చేయలేదు. పాపం చంద్రబాబు… తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఇలా చూసి తెలుగుదేశం హార్డ్ కోర్ అభిమానులు కూడా ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకొచ్చిందని ఫీలవుతున్నారు.

చేసింది చెప్పుకుని..మళ్ళీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తారో చెప్పి ఓటు అడగటం తప్పేమీ కాదు.

కానీ ఎప్పుడూ చేయని విధంగా చంద్రబాబునాయుడు ఇలా వంగి వంగి దండాలు పెట్టడంతోనే తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు అర్ధమవుతోంది.

దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేశానని చంద్రబాబు చెబుతుంటారు.

అలా చేసి ఉంటే.. చేసింది ప్రజలకు గుర్తు చేస్తే వారే గెలిపించుకుంటారు. కానీ ఆ పరిస్థితి లేదు కాబట్టే ఇలా వంగి దండాలు పెట్టి ఓట్లు అడగాల్సి వస్తోంది.

అసలు రాష్ట్రంలో జగన్‌కూ తనకూ పోటీయే లేదని చంద్రబాబు ప్రకటించారు. ఈ ఎన్నికలు కేసీఆర్‌ కూ తనకూ మధ్య అన్నారు.

మరి ఇప్పుడు ఎందుకు అంత హైరానా పడుతున్నారు. కానీ అంతటి సీనియర్ నేత అలా వంగి వంగి దండాలు పెడుతుంటే.. జాలి వేస్తోంది. మరి ఓటరు ఏంచేస్తారో.. ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *