కట్టలు తెంచుకుంటున్న చంద్రబాబు అసహనం… ‘డెకాయిట్’ అంటూ ప్రశాంత్ కిషోర్ పై విమర్శలు…

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన అసహన రాజకీయాలతో విసుగు తెప్పించేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబునాయుడు ఎక్కడికి వెళ్ళినా ఒకటే తంతు.

ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి ఏం వెలగబెట్టారని చెప్పాల్సింది పోయి పొరుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రిని విమర్శించడమో, ఎక్కడో బీహార్లో రాజకీయాలు చేసుకుంటున్న ప్రశాంత్ కిషోర్
ని విమర్శించడమో, ఇదే పనిగా పెట్టుకున్నారు చంద్రబాబు.

ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మీద చంద్రబాబు విమర్శలు ఈనాటివి కావు. కొత్తగా ఆయన మీద చేయడానికి విమర్శలు ఏమీ లేవు. కాబట్టి కొత్త అంశాన్ని తెరపైకి తెస్తున్నాడు. ఇటీవల హత్యకు గురైన వైయస్ వివేకానంద రెడ్డి ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచార సభలో చికాకు పుట్టించే చేస్తున్నాడు బాబు.

వాళ్లే చంపేసి వాళ్లే ప్రభుత్వానికి ఆ హత్యను అంటగడుతున్నారు అన్నట్లుగా చంద్రబాబు చేస్తున్న విమర్శలతో జనం ముక్కున వేలు వేసుకోవాల్సి వస్తోంది.

ఇక ప్రశాంత్ కిషోర్ విషయంలో అయితే చంద్రబాబు నాయుడు దూకుడు మరీ దారుణంగా తయారయింది.

పదేపదే ప్రశాంత్ కిషోర్ విమర్శిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సలహాదారుగా వ్యవహరించారు అన్న మాట వాస్తవం.

అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. అక్కడ ఏదో ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఓట్ల తొలగింపు జరిగిపోయిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఇంకో పక్క రాష్ట్ర ఎన్నికల అధికారి ఓట్ల తొలగింపు లేదు అని అంటున్నారు.

సర్వే కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేకపోవడంతో ఏదో ఒక అంశంతో జనం మైండ్ ని డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తోంది.

సుదీర్ఘ రాజకీయ అనుభవం తనకు ఉందని పదేపదే చెప్పుకునే బాబు హుందా తనం గురించి ఎప్పటికప్పుడు క్లాసులు పీకే బాబు ఇలా అసలు రాజకీయాలతో ఊగిపోవడం హాస్యాస్పదం.

ప్రత్యేక హోదా అనే అంశం అటకెక్కి పోయింది. రాజధాని అమరావతి ఊసేలేదు. పోలవరం ప్రకృతి గురించిన ప్రస్తావన రావడం లేదు.

వీటన్నిటినీ మించి ఇప్పుడు పూర్తిగా ఆధారపడినట్లు వైయస్ వివేకానంద రెడ్డి హత్య గురించి గానీ ప్ ప్రశాంత్ కిషోర్ వ్యవహారం గురించి కేసీఆర్ గిఫ్ట్ గురించి గుండెలు బాదుకోవడం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆసక్తి లేదు… అని తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించాక కూడా చంద్రబాబు టిఆర్ఎస్ జపం చేస్తున్నాడు అంటే ఆ స్థాయిలో చంద్రబాబు భయపడుతున్నారు అన్నమాట…

వివేకానంద రెడ్డి హత్య అనంతరం సాక్ష్యాధారాలను చెరిపేయడానికి ప్రయత్నించారు అనే మాట ఇంతవరకు ఏ పోలీస్ అధికారి వచ్చి ప్రజలకు వివరించలేదు.

అయితే చంద్రబాబు మాత్రం తనకు ఇష్టం వచ్చినట్లుగా ఆ కేసులో అభూతకల్పనలు ప్రచారం చేస్తూ ఉన్నారు. అలా మాట్లాడితే ఎన్నికలలో లో లబ్ధి కలుగుతుంది అని బాబు భావిస్తున్నట్లున్నారు.

అయిదేళ్ళ అధికారం అనంతరం ఎన్నికల సమయంలో ఇలాంటి కబుర్లు చెబితే వర్కౌట్ అవుతుంది అనుకుంటే బాబు ప్రజలకు అడ్డంగా దొరికిపోయినట్టే.

జగన్ రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ పై అనుచితమైన పద ప్రయోగం

ప్రశాంత్ కిషోర్ మరెవరో కాదు గత ఎన్నికలలో లో చంద్రబాబు మోడీతో కలిసి పనిచేసిన వ్యక్తి. అప్పుడు మోడీ చంద్రబాబుల కోసం ఏ పి లెవెల్ లో పని చేసాడు ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు ఆ straatajist ను జగన్ హైర్ చేసారు.

ఈ విషయంలో బాబు అసహనం పతాకస్థాయికి చేరుకుంది. ప్రశాంత్ కిషోర్ ను బీహారీ గజ దొంగ అంటూ బాబు సంబోధిస్తూ ఉన్నాడు.

  • అంటే బీహార్ నుంచి వస్తే గజదొంగ అవుతాడా?…
  • బీహారీ గజ దొంగ అంటే దేశంలోని ఒక రాష్ట్రాన్ని అవమానించడం కాదా?..
  • అలా అంటే మొన్న శత్రుఘ్నసిన్హా మోడీ ని తిడుతూ ఉంటే చంద్రబాబు పరవశించి పోయారు కదా…
  • శత్రుఘ్న సిన్హా బిహారీ కాదా అతడు మంచోడు…..
  • బాబు వ్యతిరేక శిబిరం లో ఉన్నాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్ గజదొంగ.

ఇది చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల అనుభవం. దీనిపై ప్రశాంత్ కిషోర్ స్పందించారు.

ఓటమి ఖరారు అయినప్పుడు నేతలు అలా అసహనం అసహనంతో స్పందించడం మామూలే. బాబు ఉపయోగిస్తున్న భాష ఆశ్చర్యం కలిగించడం లేదు.

బీహార్ కించపరిచేలా మాట్లాడడానికి బదులు ఏపీ ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయడం లేదా అనే విషయంపై దృష్టి పెట్టండి. అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

అయినా జన్మభూమి కమిటీ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో రాష్ట్రాన్ని పెట్టిన బాబు ఏపీలో పరిస్థితులను బీహార్లో కన్నా దారుణంగా తయారు చేసాడు అని అభిప్రాయాలు ఉన్నప్పుడు మళ్లీ ఈ దెప్పిపొడుపు మాటలు ఏమిటో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *