బాబు కుట్రల్ని తిప్పికొట్టండి.. వచ్చేది ప్రజారాజ్యం అంటూ చంద్రబాబుకు చెబుదాం… అంటున్న వైఎస్సార్ పార్టీ అధినేత జగన్

ఐదేళ్ల క్రితం చంద్రబాబు అనే పెద్ద మనిషిని నమ్మి మోసపోయాం.. నాలుగున్నరేళ్లలో అన్ని రకాలుగా మోసం చేసి సినిమాలు చూపించారు. చంద్రబాబు కు అన్న వస్తున్నాడని చెప్పండి.. ప్రతి పేదవాడికి సంక్షేమం అందుతుందని భరోసా ఇస్తామని హామీ ఇవ్వండి.

కడప సమరశంఖారావంలో చంద్రబాబుపై జగన్ ఫైయారు నలుగున్నరేళ్లుగా ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డ జగన్టీడీపీ పాలనలో దోపిడీ తప్ప ఏమీ లేదంటూ విరుచుకుపడ్డ వైసీపీ అధినేత జగన్.

ఎన్నికలొస్తున్నాయనే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొచ్చారని విమర్శించారు వైసీపీ అధినేత జగన్. ఓట్ల కోసమే నోటికొచ్చినట్లు అబద్దాలు చెబుతూ మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

డబ్బు సంచులతో ఎన్నికల్లో గెలిచే ప్రయత్నిస్తున్నారని.. చంద్రబాబు కుట్రల్ని వైసీపీ నేతలు, కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు వైసీపీ అధినేత .

కడపలో గురువారం ఏర్పాటు చేసిన ‘సమర శంఖారావం’ బహిరంగ సభలో పాల్గొని. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన జగన్.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు సినిమాలు చూపించారని వ్యాఖ్యానించారు జగన్. 2014లో మొదటి సినిమా మొదలు పెట్టారని.. ఆ సినిమాలో చాలా డైలాగులు (హామీలు) కొట్టారని గుర్తు చేశారు.

అందులో ఒక్కటైనా చేశారా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత మరో సినిమా చూపించారని.. అది రాష్ట్రాన్ని దోచుకోవంపై అంటూ ఎద్దేవా చేశారు.

ఇక ఇప్పుడు ఎన్నికలు ఆరు నెలలకు ముందు మరో సినిమా మొదలు పెట్టారంటూ ధ్వజమెత్తారు.

‘ఎన్నిలకు సరిగ్గా ఆరు నెలల ముందు మూడు నెలల కోసం చంద్రబాబు డ్రామా మొదలు పెట్టారు. ఇప్పుడు పెద్ద మనిషికి ప్రత్యేక హోదా గుర్తొచ్చింది.

నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసినప్పుడు ప్రత్యేక హోదా పేరెత్తితే అరెస్టులు చేయించిన పెద్ద మనిషి.. ఇప్పుడు నల్ల చొక్కాలతో బీజేపీపై పోరాటానికి బయల్దేరారు.

ఇప్పుడు హోదా కోసం పోరాటం మొత్తం తానే చేస్తున్నట్లు బాగా పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు’అంటూ మండిపడ్డారు.

‘నాలుగున్నరేళ్లలో గుర్తుకు రాని ప్రజలకు ఇప్పుడు గుర్తొస్తున్నారు. ఎన్నికలొస్తున్నాయని.. వైసీపీ ప్రకటించిన నవ రత్నాలకు కాపీ కొడుతున్నారు.

డ్వాక్రా అక్కచెల్లెమ్మలను ఆదుకుంటామని నవ రత్నాల్లో ప్రకటించగానే.. చంద్రబాబు పసుపు-కుంకమ పేరుతో డ్రామా మొదలు పెట్టారు.

నవ రత్నాల్లో రైతులకు సాయం అందిస్తామనగానే.. ఓట్ ఆన్ బడ్జెట్‌లో కొత్త పథకాన్ని పెట్టారు. రూ.5వేల కోట్లు కేటాయించారు’.

‘చంద్రబాబు ఇక పోలవరం పూర్తి కాకుండా జాతికి అంకితం చేస్తారు. అమరావతి పేరుతో డ్రామాలాడతారు.రాజధాని ఏది అని అడిగితే బాహుబలి సినిమా చూడమన్నారు.

జాబు రావాలంటే బాబు రావాలన్నారు.. ఉన్న ఉద్యోగాలను పీకేశారు.

ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ ఏమైంది. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని.. ముష్టి వేసినట్లు రూ.వెయ్యి రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయని రూ.2వేలకు పెంచారు ’.

‘అవ్వా, తాతలకు పింఛన్ పెంచుతామని వైసీపీ ప్రకటించింది. ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయని.. నాలుగున్నరేళ్లలో గుర్తుకు రాని వృద్ధులు.. ఇప్పుడు గుర్తుకొచ్చారు.

ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని పాదయాత్రలో ప్రకటించగానే.. లైఫ్ టాక్స్ రద్దు చేశారు.. ట్రాక్టర్ల విషయంలో కూడా అంతే.

ఆటో డ్రైవర్ల దగ్గరకు వెళ్లి ఖాకీ చొక్కా వేసుకొని బిల్డప్ ఇచ్చారు. ప్రతి కులానికి కార్పొరేషన్ అని జగన్ చెప్పగానే.. చంద్రబాబు ప్రతి కులానికి కార్పొరేషన్ అన్నారు’.

ఐదేళ్ల క్రితం పెద్ద మనిషిని నమ్మి మోసపోయాం..పెద్దమనిషికి ఓట్లు వేశాం.. అన్ని రకాలుగా మోసం చేసి సినిమాలు చూపించారు.

ఎన్నికల్లో మన పోరాటం చంద్రబాబు ఒక్కరితో కాదు.. లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చూపించే వారితో కూడా.

వైసీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారు అప్రమత్తంగా ఉండాలి. ఓట్లు లేకపోతే మళ్లీ నమోదు చేయించుకోండి. దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారు.

ఎన్నికలొస్తున్నాయని.. చంద్రబాబు మూటలు, మూటలు తీసుకొస్తారు. మోసాలను, అబద్దాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’.

‘చంద్రబాబు ఐదేళ్లు క్రితం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.

ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండ.. అన్నొస్తాడు పిల్లల్ని బడికి పంపిస్తే సంవత్సరానికి 15వేలు ఇస్తాడు. రైతులకు చెప్పండి..

అన్న సీఎం అయిన వెంటనే మే మాసం వస్తే ప్రతి రైతు చేతిలో రూ.12,500 పెడతాం.. జగన్ ముఖ్యమంత్రి అయితే 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 75 వేల రూపాయలు ఇస్తాడని చెప్పండి..

పొదుపు సంఘాలకు ఎన్నికలకు వరకు ఉన్న రుణాలు.. నాలుగు దఫాలుగా మాఫీ చేస్తాం.. మీ చేతికే ఇస్తామని ప్రతి అక్కా, చెల్లికి చెప్పండి. ప్రతి అవ్వ, తాతకు చెప్పండి..

అన్న ముఖ్యమంత్రి అయితే పింఛన్ రూ.3వేలు ఇస్తాడని చెప్పండి. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని చెప్పండి’ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *