సీఎం చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.

పవన్ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు: జీవీఎల్
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడుల క్రెడిట్ మోదీకే దక్కుతుందని అన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.

సీఎం చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
పాక్ నేతలు ఆయనకు హీరోల్లా కనిపిస్తున్నారని మండిపడ్డారు.

ఎన్నికలకు ముందుకు యుద్ధం వస్తుందని తనకు రెండేళ్ల ముందే ఒకరు చెప్పారంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు.

విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, మమత బెనర్జీ లాంటి నేతలకు పాక్ నేతలు హీరోలుగా కనిపిస్తున్నారని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌కు ఏం చేశారో నిన్న వైజాగ్‌ సభలో మోదీ చెప్పారని జీవీఎల్ తెలిపారు. కేంద్రం రైల్వే జోన్ రాదన్న భ్రమలో ఉన్న చంద్రబాబు.. కేంద్రం ఇచ్చిన షాక్‌తో లొల్లి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడుల క్రెడిట్ మోదీకే దక్కుతుందన్నారు.

మోదీ పాక్ మెడలు వంచి అభినందన్‌ను తిరిగి అప్పగించేలా చేశారని ప్రశంసించారు. దేశ రక్షణ విషయాల్లో కూడా కొందరు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని జీవీఎల్ మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *