చంద్రబాబు ఢిల్లీ దీక్ష కు 10 కోట్లు ఏపీ ఖజానా నుంచి*

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఆరాటం కోసం చేసిన ఢిల్లీ దీక్షకు, అప్పనంగా ఖజానా సొమ్ము దోచిపెట్టడం పై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏకంగా పది కోట్ల రూపాయలు సొమ్మును ఖజానా నుంచి విడుదల చేసి ధర్నాకు ఖర్చు చేయడం దారుణమని అంటున్నారు.

కేవలం 12 గంటల దీక్ష అది, చంద్రబాబు తన మందీమార్బలంతో ఢిల్లీలో విడిది చేసి విచ్చలవిడిగా ఖర్చు చేశారు.

news18 డాట్ కామ్ బయటపెట్టిన ఈ వివరాల ప్రకారం ఇంత సొమ్మును మహాధర్జగఖర్చు చేశారని తెలుస్తోంది.

ఢిల్లీ దీక్ష కోసం ఏపీలోని శ్రీకాకుళం, అనంతపురం నుంచి రెండు వేరు వేరు ప్రత్యేక రైళ్లను వినియోగించారు.

ఒక్కో రైలుకు 20 కంపార్ట్మెంట్ లను జత చేసి మరి హస్తి నాకు కార్యకర్తలను తరలించారు.

ఇలా రైళ్లను అద్దెకు తీసుకొని దాని కిచెల్లించిన సొమ్ము అక్షరాలా కోటి 12 లక్షల రూపాయలు.

అలాగే ఢిల్లీకి వచ్చిన వారందరికీ వసతి కోసం ఏకంగా 1100 ఏసీ రూముల్లో తీసి ఉంచారు.

అలాగే వచ్చిన వారికి భోజన సదుపాయాలు భారీ ఎత్తున కల్పించారు, ఈ మొత్తం ఖర్చు ఎనిమిది కోట్ల రూపాయలు.

ఇలా 10 కోట్ల రూపాయలు పేదల పన్నుల ద్వారా ఖజానాకు చేరిన దాని నుంచి చాలా సులువుగా వాడేసుకున్నారు.

దీనికి సంబంధించి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ను అదర్ స్టేట్ ఫంక్షన్స్ కోసం ఎనిమిది కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు గా ఏపీ ప్రభుత్వం కార్యదర్శి ముద్ద డరవి చంద్ర పేరుమీద విడుదల చేశారు.

మరో రెండు కోట్ల రూపాయలను ధర్మ పోరాట దీక్ష కోసం అంటూ కేటాయించారు. ఇలా రెండు కోట్ల రూపాయలను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా విడుదల చేశారు.

ఈ విధంగా ప్రభుత్వ సొమ్మును ధర్మపోరాటం దీక్ష కోసం కేటాయించడoఎంతవరకు సబబు అన్నది ప్రశ్నగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *