మొన్నటివరకూ జగన్ ప్రజా సంకల్పయాత్ర చంద్రబాబుకి నిద్రలేకుండా చేసింది.ఇప్పుడు జగన్ శంఖారావంతో.. బాబు లో మొదలైన కలవరం

యాత్ర చేసినన్ని రోజులు తన వేగులతో సమాచారాన్ని తెప్పించుకుంటూనే ఉన్నారు బాబు.

ఏ ప్రాంతంలో ఎలా జరిగిందీ, ఎక్కడ ఎంతమంది జనం జగన్ ని కలవడానికి వచ్చిందీ.. అన్నీ మినిట్ టు మినిట్ చంద్రబాబు దగ్గరకు అప్ డేట్స్ వెళ్లిపోయాయి.

అలా నవరత్నాల ప్రకటనకు జనం నుంచి వచ్చిన స్పందన చూసే చంద్రబాబు నిస్సిగ్గుగా వాటిని కాపీకొట్టారు.

నిన్నటి నుంచి పరిస్థితి మారిపోయింది. జిల్లాకో చోట జగన్ సమర శంఖారావాలు పూరిస్తున్నారు. తొలివిడతగా తిరుపతిలో జరిగిన శంఖారావం సభ సూపర్ హిట్.

అక్కడే చంద్రబాబు కాపీ పథకాలకు ప్రతిగా పింఛన్ ను 3వేలకు పెంచుతూ, ప్రతి చేనేత కుటుంబానికి 2వేలు ప్రకటిస్తూ.. సరికొత్త హామీలతో టీడీపీకి షాకిచ్చారు జగన్.

కడపలో రెండో శంఖారావం జరగబోతోంది. ఒక్క శంఖారావానికే చంద్రబాబు మైండ్ బ్లాక్ అయింది.

ఈరోజు తన సొంత కడపలో జగన్ ఎలాంటి ప్రకటన చేస్తారో అని చంద్రబాబులో ఆందోళన మొదలైంది. ప్రజాసంకల్ప యాత్రకు వచ్చిన స్పందన.. సమర శంఖారావాలకు కొనసాగుతోంది. అంతేకాదు.. జిల్లాలో పెట్టే ఈ భారీ సభలలోనే చేరికలుంటాయని తెలుస్తోంది.

ప్రకాశం జిల్లాలో జరిగే సమర శంఖారావంలో వైసీపీలో చేరేందుకు చీరాల ఎమ్మెల్యే ఆమంచి సిద్ధంగా ఉన్నారు.

ఆమంచి లాంటి అసంతృప్త ఎమ్మెల్యేలు.. టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీగా ఉన్నప్పటికీ మరికొంతమంది కీలక నేతలు సమరశంఖారావ సభలనే ముహూర్తాలుగా ఎంచుకున్నారు.

దీంతో ఈ సభలంటేనే చంద్రబాబుకి దడ మొదలైంది.

అనుకున్నట్టుగానే తిరుపతి సభ నుంచి టీడీపీకి ఎదురుదెబ్బ కొట్టారు జగన్. ఇక రాబోయే సభల్లో ఎలాంటి సంచలనాలుంటాయో, ఎంతమంది టీడీపీని వీడి వైసీపీలో చేరుతారో అని చంద్రబాబు భయపడుతున్నారు.

జగన్ శంఖారావాలు పూర్తయ్యేలోపు బాబు నీరసపడిపోవడం ఖాయం అనే అభిప్రాయం టీడీపీ నేతల్లోనూ ఉంది.

వీటికి తోడు సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా రావడం చంద్రబాబుకు నిద్రలేకుండా చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *