వైసీపీలోకి కేంద్ర మాజీమంత్రి.

కేంద్ర మాజీమంత్రి కావూరు సాంబశివరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుగుదేశం అనుకూల మీడియానే చెబుతోంది. ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని.

కావూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఏలూరు నుంచి ఎంపీగా పోటీచేసే అవకాశాలున్నాయని తెలుగుదేశం అనుకూల మీడియా వర్గాలే చెబుతున్నాయి.

ప్రస్తుతానికి కావూరు భారతీయ జనతాపార్టీలో ఉన్నట్టు. అయితే ఆ పార్టీలో ఆయన అంత యాక్టివ్ గా లేరు.

ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఆయన ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం ఖాయమని తెలుగుదేశం మీడియానే చెబుతోంది.

కమ్మ సామాజికవర్గానికి చెందిన ప్రముఖుడు అయిన కావూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరితే అది ఆసక్తిదాయకమైన విషయమే అవుతుంది.

గతంలో ఏలూరు నుంచి వరసగా రెండుసార్లు ఎంపీగా నెగ్గారు కావూరు సాంబశివరావు.

గత ఎన్నికల్లో అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున మాగంటిబాబు విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీచేసిన తోట చంద్రశేఖర్ ప్రస్తుతం జనసేనలో ఉన్నారు.

కావూరు ఏలూరు పాలిటిక్స్ లోకి రీఎంట్రీ ఇచ్చి ఎంపీగా పోటీచేస్తే ఎన్నికలు మరింత రసవత్తరంగా మారుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed